బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మంచి మార్కులే కొట్టేశాడు. బుల్లితెరపైన కూడా ఎన్టీఆర్ రాణించగలడని నిరూపించుకున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ చివరివారంలోకి వచ్చేసింది. ఈ వారంతంలో బిగ్ బాస్ ఇంటికి తాళాలేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ సందడి చేశాడు.

Image result for bigg boss ntr

          బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఆ హౌస్ లోకి ఎంటరై ప్రేక్షకులకు షాకిచ్చాడు. అయితే జై లవకుశ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. సినిమాను ప్రమోట్ చేసుకోవడంతో పాటు హోస్ట్ గానూ వ్యవహరించాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరికీ ఎన్టీఆర్ తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి రుచి చూపించాడు.

Image result for bigg boss ntr

          బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ మటన్ బిర్యాని వండి వడ్డించాడు. వంటలు వండడంలో ఎన్టీఆర్ ఎక్స్ పర్ట్ అని చాలా మందికి తెలీదు. ఇంట్లో కూడా ఎన్టీఆర్ అప్పుడప్పుడు వంటశాలలో దూరి తనదైన స్టైల్లో వంటలు చేస్తుంటాడట. ఈ విషయాన్ని అన్న కల్యాణ్ రామ్ బిగ్ బాస్ హౌస్ లోనే వెల్లడించాడు. దీంతో ఎన్టీఆర్ వండితే తినాలని చాలా మంది ఆశించారు.

Image result for bigg boss ntr

          బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోరిక ఫలించింది. హౌస్ లోకి ఎంటరైన ఎన్టీఆర్ అద్భుతమైన మటన్ బిర్యానీ వండిపెట్టాడు. ఎన్టీఆర్ బిర్యానీ రుచి చూసిన హౌస్ మేట్స్ అందరూ షాకయ్యారు. సూపర్ గా వండారని ప్రశంశించారు. రెండో పూటకు కూడా పెట్టుకుని తింటామని తెలిపారు. సో.. ఇలా ఎన్టీఆర్ పాకశాస్త్ర ప్రావీణ్యం వెలుగులోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: