అను నిత్యం వివాదాలకు చిరునామాగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఆమధ్య 'ఎన్టీఆర్' జీవితం పై సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించి మళ్ళీ మౌన ముద్రలోకి వెళ్ళి పోయాడు. అయితే ఏదోఒక తెలియని అజ్ఞాత శక్తి ప్రోత్సాహంతో వర్మ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకు రావడమే కాకుండా ఈసినిమాకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా వర్మ ప్రకటించాడు. 

వర్మ చేసిన ప్రకటన చూస్తున్న వారికి ఈమూవీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు లక్ష్మీ పార్వతి చెప్పిన విషయాలను సేకరించిన వర్మ ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అన్ని నగ్నసత్యాలు సంఘటనలు చూపిస్తానని చెపుతున్నాడు. 

ఎన్టీఆర్ కు జీవితం పై సినిమా అంటే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని వర్మ చెపుతున్నాడు.  ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన వర్మ ‘అడవిరాముడు' సినిమాను తన చిన్నతనంలో 23 సార్లు చూసాను అని చెపుతున్నాడు. 

అంతేకాదు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు జరిగిన మొట్టమొదటి మహానాడులో వచ్చిన లక్షలాది మంది జనంలో తాను కూడ ఒకడిని అని అంటున్నాడు వర్మ.  ఇప్పటికే ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్‌’ ను అంటూ వర్మ ఒక పాటను కూడ విడుదల చేశాడు.

అయితే వర్మ తీయబోయే ఈ సంచలనాత్మక సినిమాకు అనేక వర్గాల నుండి అడ్డంకులు రావడమే కాకుండా అనేక కోర్టు కేసులు కూడా ఈసినిమాను అడ్డుకునే ఆస్కారం ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్ చివరి రోజులలో జరిగిన నిజాలను చెప్పగలిగే శక్తి లక్ష్మీ పార్వతికి ఉన్నా ఆ యదార్ద్దాలను పూర్తిగా తీసి మెప్పించగల శక్తి వర్మకు ఎంత వరకు ఉంది అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: