హాస్యనటుడు వేణు మాధవ్ నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ 2019లోను తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని ప్రముఖనటుడు వేణుమాధవ్ అభిప్రాయపడుతున్నాడు. దీనికికారణం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అందరు ఊహించినంత వేగంగా రాడని వేణుమాధవ్ అభిప్రాయం. 

అంతేకాదు పవన్ ‘జనసేన’ అధినేత తెలుగుదేశం పార్టీకి అండగా ఎప్పుడు ఉంటుందని అంటూ మరో ట్విస్ట్  ఇచ్చాడు. ఇదే సందర్భంలో ఆఇంటర్వ్యూను నిర్వహిస్తున్న వ్యక్తి  పవన్ మద్దతి ఇవ్వకపోయినా 2019లో టిడిపి గెలుస్తుందా ? అని ప్రశ్నిస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పవన్ కళ్యాణ్‌కు తెలుసునని అందుకే ఆయన టిడిపి వెంటఉంటాడని అందువల్ల పవన్ మద్దతు ఇవ్వకపోవడం అనే ప్రశ్న తల ఎత్తదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 

ఇదే సందర్భంలో నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ రోజాలను తిట్టేందుకు టిడిపి నుంచి ఎంత డబ్బు తీసుకున్నారని వేణుమాధవ్ ను ప్రశ్నించగా ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నవ్వుతూ  తనకు చాలా ఆస్థి ఉందని అలాంటప్పుడు తనకు డబ్బులతో అవసరం ఏమిటని అంటూ తనపై వచ్చిన వార్తలను కొట్టి పారివేసాడు. 

ఇది ఇలా ఉండగా పవన్ భార్య అన్న డెలివరీ డేట్ అక్టోబర్ లో ఉండటం వల్ల పవన్ అక్టోబర్ లో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోకుండా  కేవలం ‘జనసేన’ సభ్యత్వ నమోదు కార్యక్రమాల వేగం పెంచడానికి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సాంకేతిక పరిఙ్ఞాన్ని బాగా ఉపయోగించుకోవాలని పవన్ అభిప్రాయ పడుతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: