తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారారు.   కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రంతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. అప్పటి నుంచి మహేష్ బాబు మాస్ ఇమేజ్ బాగా సంపాదించాడు.
Image result for mahesh spyder movie stills
 అతడు, ఒక్కడు, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయారు.  ఇక కొరటాల శివ దర్శకత్వంలో నటించిన శ్రీమంతుడు చిత్రం మరోసారి మహేష్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.  ఆ తర్వాత వచ్చి బ్రహ్మోత్సవం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో  మహేష్‌బాబు- రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘స్పైడర్’ చిత్రం ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  
Image result
ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న స్పైడర్ చిత్రానికి ఎలాంటి కత్తెరలు లేకుండా  దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. డ్రింకింగ్, స్మోకింగ్ సీన్స్ కూడా లేకపోవడంతో దీనికి కారణంగా చెబుతున్నారు. రన్  టైమ్ మాత్రం రెండుగంటల 25 నిమిషాలు.  మహేష్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన మూవీని తెలుగు, తమిళ భాషలతో తెరకెక్కింది.



మరింత సమాచారం తెలుసుకోండి: