సినీనటుడు ఆర్యతో ప్రముఖ హీరోయిన్ సమంత షికారు చేసి హల్ చల్ సృష్టించింది. అందులోని ఆమె టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న టాలీవుడ్ రాజధాని హైదరాబాద్ రోడ్లపై, అందరికి కన్పించేవిదంగా బైక్ పై షికారు చేసేసరికి అది కాస్థా హాట్ టాపిక్ మారి హీటెక్కించింది.

‘అత్తారింటికి దారేది’ సినిమాతో త్వరలో వస్థున్న సమంత, మరికొన్ని రోజుల్లోనే తెలుగు, తమిళ అగ్రహీరోలతో మరికొన్ని భారీ చిత్రాలతో తెరపైకి వస్థూ పెద్ద తారగానే కాకుండా అందాలతారగా పేరుతెచ్చుకున్న సమంత ఆర్యతో హైదరాబాద్ రోడ్లపై బైక్ పై వెలుతూ కనిపిస్థే చూసే వారు  ఎన్నో ఎన్నెన్నో అనుకోవడం సహజమే. అసలే సినిమాల్లో అదిగో పులి అంటే జబ్బెడు తోక అంటారాయే. అందుకే ఆర్య కు సమంతకు మద్య స్నేహమేనా.. ఇంకేమైనా ఉందా అంటు చెవులు కొరుక్కుంటున్నారు. అంతే కాదు సమంత త్వరలోనే ఈ విషయం ట్వీట్ చేస్థుంది అని కూడా చెప్పుకుంటున్నారు.

అయితే సమంతకు బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టమట, అందులోను హైదరాబాద్ వాతావరణం అంటే ఇంకా ఇష్టమట. అందుకే సమయం దొరికితే చాలు హైదరాబాద్ రోడ్లపై బైక్ పై షికారు చేయాలంటే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్థుందట. అందుకే అవకాశం దొరకడం, ఆకోరిక తీర్చేందుకు అందుబాటులో స్నేహితుడు లాంటి ఆర్య అందుబాటులో ఉండడంతో అలా రోడ్లపై వెల్లి ఇలా తిరిగి వచ్చింది, అంతలోనే ఇన్ని ఊహలు ఊహించుకోవడం సబబు కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: