బిగ్ బాస్ సీజన్ వన్ లో విన్నర్ ఎవరు అన్నది ఇంకా తేలలేదు కాని ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ లో మాత్రం హరితేజ అందరి మనసులను గెలిచేసుకుంది. పది వారాలుగా చిన్న చిన్న విషయాలు తప్పించి హరితేజ షో రక్తికట్టించడంలో తన పాత్రను నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. ఇక ఎన్.టి.ఆర్ హరితేజల మధ్య ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అన్ని బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిందే.


కావాలని హరితేజను టార్గెట్ చేస్తూ తారక్ పండించే కామెడీ అందరిని ఆకట్టుకుంది. ఇంతలా తనని కార్నర్ చేయడానికి కారణం ఏంటి అంటే బిగ్ బాస్ షోతో ఊహించని రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హరితేజకు తన సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని హామి ఇచ్చాడట తారక్. ఇప్పటికే త్రివిక్రం సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కు ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది.


త్రివిక్రంతో ఎలాగు అఆ సినిమా చేసిన అనుభవం ఉండటంతో తారక్ సపోర్ట్ తో ఆ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట. ఇక అంతేకాదు తారక్ తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు హరితేజను రిఫర్ చేస్తున్నాడని టాక్. మొత్తానికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎవరు ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో తెలియదు కాని హరితేజ మాత్రం తప్పకుండా మంచి ఆఫర్లు అందుకుంటుందని చెప్పొచ్చు.  


ఇక వచ్చిన అవకాశాలను అమ్మడు ఇక మరింత క్రేజ్ వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న హరితేజ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆదర్శ్, అర్చనలు కాకుండా మిగిలిన ముగ్గురు కంటెస్టంట్స్ నవదీప్, శివ బాలాజి, హరితేజలలో బిగ్ బాస్ విన్నర్ ఉంటారని అంచనా వేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: