స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ కు సరైన సినిమా పడాలే కానీ రికార్డులన్నీ బ్రేక్ కావడం చాల సులువైన విషయం. ప్రేక్షకులలో ముఖ్యంగా మాస్ లో విపరీత మైన ఫాలోయింగ్ ఉన్న ఈనందమూరి హీరో  ప్రస్తుతం  వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేపధ్యంలో  ఆస్థాయి హీరో  ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ఇగో పెరిగిపోవడం. సర్వసాధారణ విషయం. 

అయితే దీనికి భిన్నంగా రేపు విడుదలకాబోతున్న ‘జై లవ కుశ’ ను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  వ్యక్త పరిచిన కామెంట్స్ వెనుక వేదాంతం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయం పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు ఈ మధ్య జూనియర్ ప్రతీ టాపిక్ పైనా కాసింత వేదాంతం మిక్స్ చేసి మాట్లాడుతు ఉండటం  మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ గా జూనియర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు స్వర్గం నరకం లాంటి విషయాలను తాను నమ్మను అని చెబుతూనే ప్రతి వ్యక్తికీ అతను చేసే మంచి పనులే సుఖ సంతోషాలను ఇస్తాయని అంటున్నాడు. ఈ జనరేషన్ లో మంచి పనులు చేస్తే కనుక రాబోయే తరాలకు కూడా అది ఉపయోగపడుతుందని  అన్న తత్వాన్ని  కూడా బోధిస్తున్నాడు.

తనకు 34 సంవత్సరాల వయసు వచ్చిందని గడ్డంలో తెల్లజుట్టు కూడా కనిపిస్తుందని చెప్పిన యంగ్ టైగర్ మరో ఐదు సంవత్సరాలు గడిచాక గెడ్డం ఎలా మారుతుందో తాను ఎలా ఉంటానో తెలియదని కూడా తన పై తాను జోక్ వేసుకుని ఆ ఇంటర్వ్యూ చూసిన వారికి షాక్ ఇచ్చాడు. దీనితో ఈ ఇంటర్వ్యూ చూసిన చాలామంది ఇది అంతా జూనియర్ లో పెరిగిపోతున్న వేదాంతానికి సంకేతం అనుకోవాలా లేదంటే రేపు విడుదల  అవుతున్న ‘జై లవ కుశ’ రిజల్ట్ గురించి పడుతున్న టెన్షన్ అనుకోవాలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు వయసు మీద పడకుండా మనమేమీ చేయలేం కదా అంటూ వేదంతాన్ని తత్వశాస్త్రాన్ని కలిపి చెబుతున్నాడు. మహేష్ సినిమా ఆడాలని బన్నీ డ్యాన్సులు బాగుంటాయని ఇతర హీరోలను కూడ పొగుడుతున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ లో ఇంతటి మార్పునకు కారణం ఏంటో అన్న కామెంట్స్ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారుతున్నాయి.  దీనితో  సక్సెస్ లలో వేదాంతం బోధించే ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే అంటూ సెటైర్లు పడుతున్నాయి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: