రాబోతున్న దసరాకు విడుదల కాబోతున్న ‘స్పైడర్’ రిజల్ట్ ఇంకా తెలియకుండానే దర్శకుడు మురగదాస్ తన మనుసులోని ఆలోచనలకు  సంబంధించి ఇస్తున్న లీకులు ఇప్పడు అత్యంత సంచలనంగా మారుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం మురగదాస్ తదుపరి సినిమా ఆలోచనలలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. 

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా జయాపజయాలతో సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులు కల ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అనే విషయం అతడి విమర్శకులు కూడ అంగీకరిస్తారు. పవన్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు సీనియర్ దర్శకులతో గాని సక్సస్ రేట్ ఉన్న దర్శకులతో గాని సినిమాలు చేస్తూ ఉంటారు. 

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాకుండా తన దర్శకుల ఎంపికలో  డైరెక్టర్స్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోకుండా తన మనసుకు నచ్చిన  దర్శకులకు ఓటు వేస్తూ ఉంటాడు. దీనితో చాలా మంది సీనియర్  దర్శకులు పవన్ తో సినిమా చెయ్యాలని చాలామంది ప్రయత్నించినా వారికి పవన్ అవకాశాలు ఇవ్వలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో దర్శకుడు మురగదాస్ చేరిపోయాడు. 

‘స్పైడర్’ ను సినిమాను ప్రమోట్ చేస్తూ మురగదాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  ‘గజిని’ తమిళ్ లో హిట్ అయిన తర్వాత పవన్ తో చేద్దామనుకున్నాడట మురగదాస్. అయితే అప్పుడు పవన్ ఆ ఆలోచనలకు ఒకే చెయ్యలేదు అని అంటున్నారు. 
ఈ నేపధ్యంలో మురగదాస్ పవన్ ను మరొకసారి కలిసి ‘ఖైదీ నెంబర్ 150’ కి సీక్వెల్ లాంటి సినిమా చేద్దామని అడిగినట్లు సమాచారం. 

గతంలో ‘కత్తి’ రీమేక్ లో పవన్ నటిస్తాడని వార్తలు కూడ వచ్చాయి అది సాధ్య పడలేదు. ఈ పరిస్థుతులలో పవన్ బాగా ఇష్టపడే ఒక సామాజిక నేపధ్యం ఉన్న కథను మురగదాస్ పవన్ కు చెప్పినట్లు అటువంటి కథలను ఇష్టపడే పవన్ ఆ కథను పొడిగించమని పవన్ కోరినట్లు మురగదాస్ ఇస్తున్న లీకులను బట్టి అర్ధం అవుతోంది. దీనినిబట్టి చూస్తుంటే మురగదాస్ పవన్ ల మూవీ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: