తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివర వారంలోకి   ప్రవేశించడమే  కాకుండా  మరో నాలుగు రోజులలోఈ షో ముగింపుకు రాబోతోంది  .దీనితో  బిగ్ బాస్ 1 విజేత ఎవఋ?అన్న టెన్షన్ అందరిలోనూ బాగా పెరిగి పోయింది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ఐదుగురు సెలబ్రిటీలు తమకు ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో  బుల్లితెర
ప్రేక్షకులు తమకు గత  60 రోజులకు పైగా వినోదాన్ని పంచిన ఇంటి సభ్యులకు ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

 అయతే అనూహ్యం గా  ఈ బిగ్ బాస్ షో లోని ఒక  సెలబ్రిటికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారనే వార్త  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. దీనికి కారణం కాటమరాయుడు సినిమా అని అంటున్నారు . ఈ సినిమాలో పవన్ కు తమ్ముడి గా నటించిన  శివ బాలాజీ అంటే పవన్ కు బాగా ఇష్టం అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికి తోడు పలు చిత్రాల్లో శివ బాలాజీకి  పవన్ అవకాశాలు కల్పించాడు అని కుడా చాలామంది అంటారు 

 దీనితో  పవన్ కు ఇష్టమైన శివబాలాజీకి మద్దతు తెలపాలని పవన్ అభిమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు శివబాలాజీ పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకొన్నప్పుడు పవన్ అండగా ఉన్నాడు అనే ప్రచారం కుడా ఉంది. వీరి వివాహా కార్యక్రమానికి  పవన్ స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించిన సందర్భాన్ని కుడా పవన్ అభిమానులు గుర్తుకు చేసుకుంటున్నారు. 

60 రోజుల క్రితం బిగ్ బాస్ లోకి ప్రవేశించిన శివ బాలాజీ తనదైన శైలిలో రాణించడమే కాకుండా శివ బాలాజీ తనదైన ప్రత్యేకమైన పంథాలో ఈ షో లోఅనుసరిస్తున్న తీరు అందరినీ ముఖ్యం గా పవన్ అభిమానులను బాగా ఆకర్షిస్తున్నట్లు టాక్. దీనికి తోడు ఇంటి కెప్టెన్ గా కూడా రెండు సార్లు చక్కగా శివ బాలాజీ వ్యహహరించిన తీరుకుడా పవన్ అభిమానులను బాగా ఆకట్టు కొంటోoది అన్న ప్రచారం జరుగుతోంది .దీనితో బిగ్ బాస్ షో విజేత రేస్ లో  స్ట్రాంగ్  అభ్యర్థిగా శివబాలాజీనిలవడమే కాకుండా అతడి గెలుపు ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: