అక్కినేని అంటే తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లొ ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి. భారతీయ సిని పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత పౌరపురస్కారాలలో రెండవ అతి పెద్ద పురస్కారమైన "పద్మ విభూషణ్" తో భారత ప్రభుత్వం సత్కరించగా, భారత సినీరంగం ఆయన సాధించిన సినీ కళావిజయాలకు గాను జీవిత సాఫల్య పురస్కారము "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" అందించారు. ఎక్కడ ఒక నిరుపేద సేద్య స్వేద జీవి పసుకాపరి అనంతానంత అభ్యుదయ పధంలో శ్రమించి సాధించిన విజయాలు "నభూతోః న భవిష్యతి" 

సంబంధిత చిత్రం

కృష్ణా జిల్లా రామాపురంలో జన్మించి, చిన్ననాడే నాటకరంగంపై మనసుపడి అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను అద్భుతంగా అభినయించిన అనుభవంతో ఘంటసాల బలరామయ్య అందించిన ప్రోత్సాహంతో తన సహజమైన కళల పై ఆసక్తితో 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించబడ్డ "ధర్మపత్ని" చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమై, ఆ తర్వాత 1944 లో ఘంటసాల బల రామయ్య తెరకెక్కించిన "సీతారామ జననం" సినిమాతో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. 
నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరవాతనే అక్కినేని 1949లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు వెంకట్, నాగార్జున ఇద్దరు కొడుకులు, సత్యవతి, నాగ సుశీల, సరోజ ముగ్గురు కుమార్తెలు. తన ధర్మపత్ని అన్నపూర్ణే "అన్నపూర్ణ స్టూడియోస్" నిర్మాణానికి స్పూర్తి కాబట్టే ఆమె పేరే తన స్టూడియోకి పెట్టారు. అదే "అన్నపూర్ణ స్టూడియోస్" బేనర్ నుండి కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శక సాంకేతిక నిపుణుల్ని లెక్కకు మిక్కిలిగా పరిచయం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భారతీయ భాషల్లో అన్నీ కలిపి నటించిన సినిమాలు 256 లలో ఆఖరి సినిమా “మనం”. 

nageswara rao manam movie కోసం చిత్ర ఫలితం

నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా మహా ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి, మరెన్నో మరపురాని చిత్రాల్లో "తనకు మాత్రమే సాధ్యం" అనతగ్గ నటనతో అభిమానులను ఆకట్టుకుంటూ సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో విభిన్న పాత్రలలో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి ప్రేక్షకులను మెప్పించారు. 1953 లో దేవదాసు చిత్రంతో "ఒక భగ్న ప్రేమికుడు" గా, తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలై న నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేనికే దక్కింది. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా "కళ్యాణి",  బ్లాక్ బస్టర్ మూవీ "ప్రేమాభిషేకం" 1981 విడుదలై ఒక సంచలనమే సృష్టించింది. అక్కినేని 1971లో నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం  వచ్చిన దసరా బుల్లోడు. అన్నీ విజయాల పరంపరలే. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు కూడా  అక్కినేని నాగేశ్వరరావు కావటం ఒక విశేషం. 

dasara bullodu images కోసం చిత్ర ఫలితం

చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు తరలించటానికి అక్కినేని చేసిన కృషి అనిర్వచనీయం. తమిళ ప్రభావిత మద్రాస్ చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి, మన తెలుగు సినీ పరిశ్రమ ఔన్నత్యాన్ని విశ్వవిఖ్యాతం చేయటములో అక్కినేని చేసిన సేవలు సర్వదా ప్రశంసనీయం. నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఆయన సేవలు తెలుగు జాతి మరువలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్ నాగార్జున, నవ యువ సామ్రాట్ నాగ చైతన్య లను తన వారసులలుగా చిత్ర పరిశ్రమకు అందించిన మహావృక్షం అక్కినేని. 

సంబంధిత చిత్రం

కళాప్రపూర్ణ, గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో భారత ప్రభుత్వ పౌర పురస్కారాలు పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో నందమూరి తారక రామారావు జాతీఎయ అవార్డులు అందుకున్నారు.  2011లో భారతీయ సినీ రంగానికి అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు "పద్మవిభూషణ్ అవార్డు" తో భారత ప్రభుత్వం చేత సత్కరించబడ్ద  తొలి తెలుగు నటుడు అక్కినేని. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ఏ.ఎన్.ఆర్. ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 


నేడు ఆ మహనీయుని జన్మదినం (జయంతి) పురస్కరించుకొని ఇండియా హెరాల్డ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది. 

happy birthday to anr కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: