జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఎన్టీఆర్ కెరీర్‌లో తొలిసారి మూడు పాత్ర‌ల్లో నటించ‌డంతో పాటు ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో ఉండ‌డం, సినిమాకు ఎన్టీఆర్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఈ సినిమా హైప్ స్కై రేంజ్‌లో ఉంది. గురువారం రిలీజ్ అయిన జై ల‌వ‌కుశ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఇప్ప‌టికే కంప్లీట్ అయ్యాయి. 


ప్రీమియ‌ర్ షో కంప్లీట్ అయ్యాక సినిమాలో ఫ‌స్టాఫ్‌ను ద‌ర్శ‌కుడు బాబి సాదాసీదాగ న‌డిపించాడు. ఫ‌స్టాఫ్‌లో సినిమాను స్పీడ్ చేయ‌లేదు. చిన్న‌ప్పుడు జై, ల‌వ‌,కుశ పాత్రల ప‌రిచ‌యంతో పాటు ఎక్కువుగా లవ, కుశ పాత్రలతో నిండిపోయింది. లవ, కుశ పాత్రలు కాస్త ఎంట‌ర్‌టైన్ చేశాయి. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో జై రోల్ ఎంట్రీ చేయించిన విధానం అదుర్స్‌.


అయితే ఫ‌స్టాఫ్‌లో జై క్యారెక్ట‌ర్ ఎంట్రీ అయ్యే వర‌కు ఉన్న సీన్లు అన్ని సాదాసీదాగా మ‌నం గ‌తంలో చూసిన‌వే అనిపిస్తాయి. ఇక జై క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చాక మాత్రం సెకండాఫ్‌లో సినిమాపై అంచ‌నాలు పెరుగుతాయి. జై రావణుడిగా ఎలా మారాడు, అంత వైలెంట్ అవ్వ‌డానికి కార‌ణాలు, అత‌డి పొలిటిక‌ల్ యాంబిష‌న్, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్లు అన్ని ఆక‌ట్టుకున్నాయి. హీరోయిన్లు క్యారెక్ట‌ర్ల వ‌ర‌కు న్యాయం చేశారు. త‌మ్మ‌న్నా స్వింగ్ జ‌రా సాంగ్‌లో అందాల‌ను హాట్ హాట్‌గా ఊపేసి మ‌రి చూపించింది.


ఎన్టీఆర్ పోషించి మూడు పాత్రల్లో జై రోల్ కి ఎక్కువ మార్కులు పడతాయనడంలో సందేహం లేదు. ఈ రోల్‌లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఇక ద‌ర్శ‌కుడు బాబి పాత క‌థ‌తో వ‌చ్చాడు. అయితే ఎక్కువుగా జై పాత్ర‌ను ఎలివేట్ చేసి సినిమాను గ‌ట్టెక్కించాడు. ఓవ‌రాల్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా న‌చ్చే జై ల‌వ‌కుశ కామ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం జ‌స్ట్ ఓకే మూవీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: