పవన్ మాజీ భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్యాన్ని ఏర్పరుచుకున్న రేణుదేశాయ్ ఎప్పుడు సోషల్  మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటుంది. ఆమె చేసే సందడి ఒకోక్కసారి పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించి ఆమెను పవన్ అభిమానులు సెటైర్లతో టార్గెట్ చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. 

అయినా ఇలాంటి విషయాలను ఆమె పట్టించుకోకుండా మహిళా సాధికారతకు ప్రతినిధిగా ఎప్పుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూనే ఉంటుంది. ఇప్పటికే నటిగా నిర్మాతగా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న రేణు దేశాయ్ బుల్లితెర రంగప్రవేశం చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అధికారికంగా ధృవీకరిస్తూ  'స్టార్‌ మా' నుంచి ప్రకటన వచ్చింది.

రేణు దేశాయ్‌ని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రోమో టీజర్‌ని కూడ విడుదలచేశారు. ఈ ప్రోగ్రామ్‌ పేరు 'నీతోనే డాన్స్‌' రేణు దేశాయ్‌ ఈషోకి జడ్జ్‌ గా వ్యవహరించబోతోంది మరో జడ్జిగా జానీ మాస్టర్‌ కూడ వ్యవహరించబోతున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ కి జానీ మాస్టర్‌ అత్యంత సన్నిహితుడు అన్న విషయంతెలిసిందే. 

గతంలో ఈ డాన్స్ మాస్టర్ దర్శకుడిగా మారి పవన్‌ కళ్యాణ్‌ తో ఒక సినిమా చేసేందుకు చాలతీవ్రంగా ప్రయత్నించాడు. ఈ కాంబినేషన్ బట్టి రేణు దేశాయ్ కి ఈ అవకాశం రావడం వెనుక పవన్ పాత్ర సహకారాలు ఉన్నాయి అని అనిపించడం సహజం. ఇక ఈ ప్రోగ్రామ్‌ కి బుల్లితెర బ్యూటీ ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది అని తెలుస్తోంది. 

తెలుగు బుల్లితెర పై డాన్స్‌ షో అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది  'ఢీ' షో  అనే చెప్పాలి 'ఢీ' సిరీస్‌ లో చాలా సీజన్స్‌ నడిచాయి.  మరి ఈ పరిస్థితులలో  రేణుదేశాయ్‌ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న    'నీతోనే డాన్స్‌' కు ఎటువంటి స్పందన లభిస్తుంది అన్న విషయమై రేణు దేశాయ్ బుల్లితెర కెరియర్ ఆధారపడి ఉంది. అయితే ఈ షోకు పవన్ అభిమానులు ఎలాంటి స్పందన ఇస్తారు అనే విషయం కూడ కీలకంగా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: