నిన్న అక్కినేని నాగార్జున తన రాజుగారి గది 2 ట్రైలర్ ను లాంచ్ చేస్తూ అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేయ బడ్డ  ‘రాజు గారి గది-2’ ట్రైలర్ లాంచ్  ఫంక్షన్ కు నాగ్ సరికొత్తగా తయారై వచ్చాడు. ఆశ్చర్యకరంగా నాగ్ మీసం తీసేసి ఈ వేడుకకు వచ్చాడు.
 
ఈ లుక్ లో చాలా కొత్తగా కనిపించాడు నాగ్.‘అన్నమయ్య’ ‘శ్రీరామ దాసు’  లాంటి సినిమాలు చేసేటపుడు కూడా మీసం తీయడానికి ఒప్పుకోని  నాగార్జున ఇప్పుడిలా సడెన్ గా మీసం తీసేసి కనిపించడం నిన్న చాలా మందికి షాక్ ఇచ్చింది .దీనితో  నాగార్జున  ఊరికే మామూలుగా మీసం తీశాడా లేక ఏదైనా సినిమా కోసం ఇలా తయారయ్యాడా అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి.
 
అయితే ప్రస్తుతానికి నాగార్జునకు ఇమీడియట్ కమిట్మెంట్లయితే ఏవీ లేవు అన్నది వాస్తవం.లేటెస్ట్ గా నాగార్జున  ‘శమంతకమణి’ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో నానితో కలిసి చేయబోయే మల్టీస్టారర్ మాత్రమే.  ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.  దీనికి కారణం ఇంకా సినిమా  స్క్రిప్టు కుడా  పూర్తి గా తయారవ్వలేదు అని అంటున్నారు .ఈ సినిమాకు  నాని  డేట్స్ ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది  అనే వార్తలు కుడా ఉన్నాయి.

దీనితో నాగార్జున త్వరలో జరగా బోతున్న నాగ చైతన్య పెళ్లిలో డిఫరెంట్ లుక్ లో కనిపించడానికి ఇలా  సరదాగా మీసం తీశాడేమో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున లేటెస్ట్ లుక్ ప్రస్తుతం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండ గా నిన్న విడుదల అయిన రాజు గారి గది 2 ట్రైలర్ చుసిన వారు ఈ సినిమా పై రజనీకాంత్ ‘చంద్రముఖి’ ఛాయలు ఉన్నాయి అన్న కామెంట్స్ కుడా  చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: