యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ విష‌యంలో అంతా అనుకున్న‌ట్టే జ‌రుగుతోంది. ‘జై లవకుశ’తో తారక్ గత రికార్డులను నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. ఈ సినిమా షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైతే ఓవ‌ర్సీస్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో బుధ‌వారం నుంచే ప్రారంభ‌మ‌య్యాయి. ఇక తెలుగు సినిమాకు అక్ష‌య‌పాత్ర‌గా భావిస్తోన్న ఓవ‌ర్సీస్‌లో అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ ఎత్తున రిలీజ్ చేశారు.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

అమెరికాతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 దేశాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా గురువారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ అయ్యింది. ఇక యూఎస్ ప్రీమియ‌ర్ల‌లో జై ల‌వ‌కుశ బాక్సాఫీస్‌ను చిత‌క్కొట్టేసింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న లెక్క‌ల ప్ర‌కారం ఏకంగా $ 540 K కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. (అయితే ఇంకా పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది). 


ఇంకా పూర్తి స‌మాచారం అంద‌కుండానే ప్రీమియ‌ర్ల ద్వారా హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇది నాన్ బాహుబ‌లి సినిమాల్లోనే పెద్ద రికార్డుగా నిలిచింది. యూఎస్‌లో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఉండడంతో జై ల‌వ‌కువ వ‌సూళ్లు ప్ర‌బంజనం క్రియేట్ చేయ‌నున్నాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో కూడా ద‌స‌రా సెల‌వులు వ‌చ్చేయ‌డంతో పాటు సినిమాకు హిట్ టాక్ రావ‌డం క‌లిసిరానుంది.


jai lava kusa images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: