ఈ శరన్నవరాత్రులలో రెండవరోజు అయిన ఈరోజు అమ్మవారిని గాయత్రిదేవి గా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. ఈ రోజు అమ్మవారు ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది. అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖ పక్కన రుద్రుడు ఉంటారు.
Image result for BALATRIPURASUNDARI
అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతి గాను  పూజలందుకుంటుంది. గాయత్రి ధ్యానం అనంత మహిమ కలది. ఈ మంత్ర పఠనంతో అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. 
Related image
ఆది శంకరులవారు గాయత్రి మాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది అని చెపుతారు.  నవరాత్రులలో ఈరోజు అమ్మవారిని ఉపాసన చేసి అల్లపు గారె నివేదన చెయ్యాలి. ఈ రోజు దుర్గామాత రెండవ అవతారాణి కొన్ని చోట్ల  బ్రహ్మచారిణి గా కూడ ఆరాధిస్తారు.    

ఈ  రోజు అమ్మవారిని ఉపాసించే వారికి  సర్వ విజయాలు  లభిస్తాయి అని అంటారు.  ఈ రోజు అమ్మవారు చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శన మిస్తారు. మన పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపక్కన  రుద్రుడు ఉంటారు. మొదటి మూడు రోజులు బ్రహ్మ చారిణ గా కనిపించే అమ్మవారి ముఖంలో ఒక అద్వితీయమైన తేజస్సు కనిపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: