యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌త్తా చాటింది. తెలుగు సినిమాకు అక్ష‌య‌పాత్ర‌గా మారిన ఓవ‌ర్సీస్‌లో జై ల‌వ‌కుశ‌ను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. 168 లొకేషన్స్‌లో వేసిన ప్రీమియర్ షోస్ ద్వారా ఈ చిత్రం $560,699 కలెక్ట్ చేసింది. దీంతో.. ఈ చిత్రం యూఎస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో టాప్-10 జాబితాలో 6వ స్థానం దక్కించుకుంది.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

వాస్త‌వంగా చెప్పాలంటే నిజానికి.. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల దృష్ట్యా ఇది గత ‘నాన్-బాహుబలి’ రికార్డుల్ని బద్దలుకొడుతుంద‌ని అంద‌రూ భావించారు. దీంతోనే జై ల‌వ‌కుశ‌ను ఎన్టీఆర్ కెరీర్‌లోనే రికార్డు లొకేష‌న్ల‌లో రిలీజ్ చేశారు. అయితే ఆ మేర వ‌సూళ్లు మాత్రం రాలేదు. తార‌క్ త‌న గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా ప్రీమియ‌ర్ రికార్డునే బ్రేక్ చేయ‌లేకపోయాడు. 


ప్రీమియ‌ర్ల‌లో ఎక్కువ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన తెలుగు చిత్రాల్లో జ‌న‌తా గ్యారేజ్ 5 వ ప్లేస్‌లో ఉండ‌గా జై ల‌వ‌కుశ 6వ ప్లేస్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో పాటు యూఎస్‌లో మంచి పాజిటివ్ టాక్ రావ‌డంతో జై ల‌వ‌కుశ యూఎస్‌లో ఫ‌స్ట్ వీకెండ్‌లో 1.5 మిలియ‌న్ల మార్క్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా. టోటల్ రన్‌లో 2.5 మార్క్‌ని క్రాస్ చేసే అవకాశం క‌నిపిస్తోంది.

jai lava kusa images కోసం చిత్ర ఫలితం

టాప్-10 యూఎస్ ప్రీమియ‌ర్ తెలుగు గ్రాస‌ర్లు :
బాహుబలి 2 – $ 4517704
బాహుబలి 1 – $ 1364416
ఖైదీ నెం 150 – $ 1295613
సర్దార్ గబ్బర్‌సింగ్ – $ 616054
జనతా గ్యారేజ్ – $ 584255
జై లవకుశ – $ 560,699
బ్రహ్మోత్సవం – $ 560274
డీజే దువ్వాడ జగన్నాధం – $ 538011
శ్రీమంతుడు – $ 535984
ఆగడు – $ 523613


మరింత సమాచారం తెలుసుకోండి: