ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం పరితపిస్తున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈమధ్యనే ఈ మూవీ సెట్లోకి రాజమౌళిని రప్పించుకుని ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు రామ్ చరణ్.

ఇప్పుడు చాలదు అన్నట్లుగా ‘రంగస్థలం’ మూవీ ప్రమోషన్ కోసం చరణ్ ఏకంగా తన బాబాయ్ పవన్ సహాయాన్ని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడ వచ్చే వారం రాబోతున్న విజయదశమి రోజున లాంచ్ చేయడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఫస్ట్ లుక్ ను పవన్ చేత విడుదల చేయిస్తే ‘రంగస్థలం’ మూవీకి మరింత క్రేజ్ రావడమే కాకుండా మెగా ఫ్యామిలీ అంతా ఒకటిగానే ఉంది అన్న సంకేతాలు పంపే విధంగా చరణ్ పవన్ సహకారాన్ని ఆశిస్తున్నట్లు టాక్. ఆమధ్య బాగా దూరం జరిగిన చరణ్ పవన్ లు తిరిగి దగ్గర అవ్వడమే కాకుండా పవన్ సినిమా కోసం రంగస్థలం మూవీని సంక్రాంతి రేసు నుండి రామ్ చరణ్ తప్పించి డిసెంబర్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 

చరణ్ చేసిన సహకారానికి సపోర్ట్ గా పవన్ ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను లాంచ్ చేస్తాడని ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు దర్శకుడు సుకుమార్ పట్ల కూడ పవన్ కు గౌరవం ఉన్నరీత్యా దసరా రోజున బాబాయ్ అబ్బాయిల కలయిక ఖాయం అని అంటున్నారు.

అయితే వాతావరణంలో అనుకోకుండా వచ్చే మార్పులు ఎలా ఊహించలేమో పవన్ మనస్తత్వాన్ని నిర్ణయాలను అంచనా వేయడం కష్టం. ఈ నేపధ్యంలో మెగా అభిమానులు కోరుకునే ఈ మెమరబుల్ ఈవెంట్ దసరా రోజున జరుగుతుందా జరగదా అనే విషయం తెలియడానికి మరొక వారం రోజులు పట్టే అవకాసం ఉంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: