జూనియర్ యన్టీఆర్ వల్ల ‘బిగ్ బాస్’ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అన్న విషయం జూనియర్ వ్యతిరేకులు కూడ అంగీకరిస్తారు. ఈ షోను ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ చేసే విషయంలో జూనియర్ చూపించిన ప్రతిభ మరియు సమయ స్పూర్తి అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది.  

ఇప్పుడు ఈ రియాల్టీ షో మరో మూడు రోజులలో ముగిసిపోతున్న నేపధ్యంలో ఈ షోకు వచ్చిన క్రేజ్ తో హిందీ ‘బిగ్ బాస్’ మాదిరిగానే తెలుగు ‘బిగ్ బాస్’ ని కూడ పలు సీజన్లుగా నిర్వహించేందుకు స్టార్ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే  యన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్ 2ని హోస్ట్ చేస్తాడా లేదా అనే విషయంపై జూనియర్ ఇంకా ఏమి స్పష్టమైన నిర్ణయంతీసుకోలేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి.

తారక్ ఇంట్రెస్ట్ చూపితే వచ్చే సీజన్ కూడ అతడి చేతనే హోస్ట్ చేయించే ప్లానింగ్ లో స్టార్ గ్రూప్ ఉన్నా ఈ విషయమై జూనియర్ కు ప్రస్తుతానికి ఒక స్థిరనిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు. ఇండస్ట్రీ సర్కిల్స్ లో వస్తున్న వార్తల ప్రకారం ‘బిగ్ బాస్’ షో విషయంలో జూనియర్ కు కొన్ని అసంతృప్తులు ఉన్నట్లు టాక్. 

దీనికితోడు ఈ కార్యక్రమాన్ని  మళ్ళీమళ్ళీ నిర్వహిస్తే అది వెగటుగా మారి బుల్లితెర ప్రేక్షకులకు కూడ బోరింగ్ గా మారవచ్చు అన్న భయాలు జూనియర్ కు ఉన్నట్లు సమాచరం. దీనితో ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే విషయంలో జూనియర్  ఒప్పుకోకపోతే మాత్రం అతడి స్థానంలోకి ఇద్దరు యంగ్ హీరోలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

వచ్చే సీజన్ సెలిబ్రిటీలతో పాటు కామన్ ఆడియెన్స్ కూడ ‘బిగ్ బాస్’ లో పాల్గొంటారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరైనా మీడియం రేంజ్ హీరోలతో ఈ షోని హోస్ట్ చేస్తే బావుంటుందనే ఆలోచనలో స్టార్ గ్రూప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం  అక్కినేని అఖిల్ తో ఓ సీజన్ ని హోస్ట్ చేయించి ఆ తరువాత అవకాశం నానికి ఇచ్చేలా స్టార్ మాటీవీ యాజమాన్యం ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. అయితే అఖిల్ సనర్ధత సమయస్పూర్తి ఈ షోను నిర్వహించడానికి సరిపోతుందా అన్నదే సందేహం..



మరింత సమాచారం తెలుసుకోండి: