చట్టం ముందు అందరూ సమానమే అని మరోసారి రుజువైంది.   తాగి వాహనం నడిపితే ఎంతటి వారికైనా చట్టం శిక్ష విధిస్తుందని ఆ హీరో విషయంలో రుజువైంది. వివరాల్లోకి వెళితే..జర్నీ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ నటుడు జై... కొంత కాలంగా హీరోయిన్ అంజలితో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే.   ప్రస్తుతం అంజలి ‘బెలూన్’ చిత్రంలో హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
Image result for నటుడు జై
ఈ చిత్రంలో హీరో జై కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటూ.... బాగా సెటిలైన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.  షాపింగ్ మాల్ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. చాలా రోజుల వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యారు.  
అంజలి-జై
తాజాగా హీరో జై  డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. చెన్నైలోని  ఓ పార్టీలో పాల్గొన్న జై తర్వాత ఇంద్రానగర్‌లోని తన ఇంటికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. మద్యం మత్తులోవున్న జై.. మార్గమధ్యలో అద్యార్ ఫ్లైఓవర్ దగ్గర డివైడర్‌కి కారు ఢీ కొట్టాడు.  
ఆమె అంటే చాలా ప్రేమ
ఈ ప్రమాదంలో తన ఆడి కారుకి బాగానే డ్యామేజ్ అయ్యింది. జై కి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. పోలీసులు అతడిపై రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.  ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు ఈ నటుడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: