తెలుగు ఇండస్ట్రీలో ‘అంకుశం’ చిత్రంతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్.  పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ అదరగొట్టేవాడని అప్పట్లో పేరు వచ్చింది.  ఇక అల్లరి ప్రియుడు చిత్రంతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.  ఆ తర్వాత ఫ్యామిలీ తరహ చిత్రాలతో మెప్పించిన రాజశేఖర్ తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  గత కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడం చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు.  


తాజాగా రాజశేఖర్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌ని రేపు సాయంత్రం 5గం.లకు రానా తన అఫీషియల్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ ద్వారా విడుదల  చేశారు.  ఇప్పటికే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్ చాలావరకూ పూర్తయింది.

మిగతా చిత్రీకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో వున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.ఇందులో పూజా కుమార్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జార్ణ్ అనే కరుడు గట్టిన విలన్ పాత్రలో కిషోర సహా నటిస్తున్నాడు. నాజర్, పోసాని , అలీ, పృధ్వీ, షియాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, చరణ్ దీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Image result for garuda vega
భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: