తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఒక పెద్ద హీరోకి ఇలా వరుస విజయాలు రావడం అనేది చాలా అరుదైన విషయం. అలాంటిది టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘జై లవ కుశ’ తో మరో అద్భుత విజయాన్ని సాధించాడు.  బాబీ దర్శకత్వంలో తన సోదరుడు నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో మొట్ట మొదటి సారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటించారు ఎన్టీఆర్.  
Image result for jai lava kusa posters
ఈ సినిమాలో ఓ పాత్ర పూర్తి స్థాయిలో ప్రతినాయకుడిగా కనిపించారు ఎన్టీఆర్.  సినిమాలో లవ, కుశ పాత్రలు ఒక ఎత్తైతే ‘జై’ పాత్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు..అయితే ఈ పాత్రలో తారక్ విలనీజాన్ని అద్భుతంగా పండించాడు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మొదట డివైడ్ టాక్ వచ్చినా..రెండో రోజుకి సినిమా హిట్ టాక్ వచ్చింది.  ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ తో ఓవర్సీస్ లో దుమ్మురేపాడు.
Image result for jai lava kusa
 ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు బాగా స్పందన లభించింది.  ఓవరాల్ గా ఏడున్నర లక్షల డాలర్ల కు పైగా వసూల్ చేయడంతో  ఈ చిత్రం అవలీలగా 2 మిలియన్ మార్క్ ని చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నెల 27న  తమిళ స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ రిలీజ్ కాబోతుంది. ఒక వేళ ఈ సినిమా హిట్ టాక్ వస్తే..రెండు సినిమాల మద్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది.  
Image result for jai lava kusa
ఈలోగా ‘జై లవ కుశ’ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్ని విషయం తెలియాల్సి ఉంది.  మొత్తానికి  ఓవర్సీస్ లో దుమ్ము రేపే చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు సంఖ్య బాగానే పెరుగుతోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల సరసన జై లవకుశ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడే నాలుగున్నర కోట్లు సాధించాడంటే 2 మిలియన్ ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: