కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ భారత దేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. అల్ రౌండర్ గా ఎన్నో రికార్డులు నెలకొల్పిన కపిల్ దేవ్ తన  సారథ్యం వహించి  ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
Arjun Kapoor to play the role of Kapil Dev in Kabir Khan’s next?
తాజాగా బాలీవుడ్ ఫిల్మ్‌మేక‌ర్ క‌బీర్ ఖాన్ దృష్టి 1983లో భార‌త క్రికెట్ జ‌ట్టు సాధించిన ప్ర‌పంచ‌క‌ప్ మీద ప‌డింది.  క‌పిల్ దేవ్ సార‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో పోరాడి భార‌త్ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ గెల్చుకుని భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన విషయాన్ని తెరకెక్కించే పని లో పడ్డారు క‌బీర్ ఖాన్. ఈ నేపథ్యంలో సినిమాకు `వ‌ర‌ల్డ్ క‌ప్ 1983` అని పేరు కూడా ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది.  

అయితే కపిల్ దేవ్ పాత్ర కోసం అర్జున్ క‌పూర్, ర‌ణ్‌వీర్ సింగ్, హృతిక్ రోష‌న్‌ల‌ను నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్లు, చివరికి అర్జున్ కపూర్ ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు సమాచారం.    
Image result for 1983 world cup
ఇక  జాతీయ అవార్డు గ్ర‌హీత ద‌ర్శ‌కుడు సంజ‌య్ పూర‌న్ సింగ్ చౌహాన్ ఈ చిత్రానికి క‌థ అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది..పూర్తి నటుల వివరాలు సెప్టెంబ‌ర్ 27న ఓ వేడుక నిర్వ‌హించి తెలియ‌జేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: