మెగా డాటర్ నిహారిక పెళ్లికి సంబంధించిన గాసిప్పులు ఆ మధ్య కొంత కాలం క్రితం మీడియాలో హడావిడి చేసాయి. అయితే ఆ వార్తలను ఆ తరువాత మెగా ఫ్యామిలీ ఖండించింది. ‘ఒక మనసు’ సినిమా తరువాత అనేక కథలను విన్న నిహారిక ఎట్టకేలకు తన లేటెస్ట్ మూవీ పై ఒక స్థిర నిర్ణయం తీసుకుంది. 

ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడ విడుదలైంది. ప్రభాస్ సొంత బ్యానర్ గా పేరు గాంచిన యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈసినిమాకు ఆశ్చర్యకరంగా 'హ్యాపీ వెడ్డింగ్' అన్న టైటిల్ ను ఫిక్స్ చేసారు. 

దీనితో నిహారికకు పెళ్ళి కుదిరిందా అన్న హడావిడి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జరిగింది. అయితే ఈ ఈ వెడ్డింగ్ వార్తలు నిహారిక సినిమా టైటిల్ కు సంబంధించి అని తెలుసుకుని చాలామంది ఆ తరువాత నవ్వుకున్నారు.  సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో నిహారికది కీలక పాత్ర అని తెలుస్తోంది. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 4 నుంచి ‘హ్యాపీ వెడ్డింగ్’ షూటింగ్ ప్రారంభం అవుతుంది అను తెలుస్తోంది. రొమాంటిక్ జోనర్ లో ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా రూపొందింపబడుతున్న ఈసినిమా అయినా నిహారిక కలలను నిజం చేస్తుందేమో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: