సినిమాని ప్ర‌చారం చేసుకోపోతే.. బాక్సాఫీసు ద‌గ్గర నిల‌బెట్ట‌లేమ‌న్న సంగ‌తి ద‌ర్శ‌కుడు తేజ‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంద‌నుకొంటా. త‌న 1000 అబ‌ద్దాలు సినిమాకి కొత్త ర‌కం ప్ర‌చారం చేసుకొంటున్నాడు. సినిమా మొద‌లెట్టిన రోజు.. ఇది తేజ సినిమా కాదు అని షాక్ ఇచ్చాడు.

ఇప్పుడు న‌వ్వ‌కుండా ఈ సినిమా చూడ‌గ‌ల‌రా?  అంటూ స‌వాలు చేస్తున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 1000 అబద్దాలు ఆగ‌స్టు 15న విడుద‌ల కాబోతోంది. సినిమా అంతా హిలేరియ‌స్ కామెడీ అంట‌!  సినిమా చూసిన వాళ్లు ప‌డీ ప‌డీ న‌వ్వాల్సిందే. అలా న‌వ్వ‌కుండా సినిమా చూడ‌డం అసాధ్యం అంటున్నాడు తేజ‌.

 న‌వ్వ‌కుండా సినిమా అంతా చూస్తే బ‌హుమానాలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించినా జ‌నం నమ్మ‌రేమో. ఎందుకంటే టైటిల్ అలాంటిది. ఈ బ‌హుబ‌తి కూడా అబ‌ద్ధం అనుకొనే ప్ర‌మాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: