రామ్‌చ‌ర‌ణ్ సినిమా ఎవ‌డుకి A సర్టిఫికెటే వ‌చ్చింది. ఎవ‌డు సెన్సార్ శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ సాగింది. ఈ సినిమా ఆత్యంతం చూసిన సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. అంతే కాదు.. కొన్ని క‌ట్లు కూడా సూచించింది. సెకండాఫ్ లో ర‌క్త‌పాతం భారీగా ఉంద‌ట‌. అంతేకాదు... అమీజాక్స‌న్ బీచ్‌లో బికినీ సీన్ల‌కూ క‌త్తెర ప‌డింది.

 u/a స‌ర్టిఫికెట్ కావాల‌ని దిల్ రాజు అండ్ బృందం ప‌ట్టుబ‌ట్టినా ప‌ని కాలేదు. దాంతో ఈ సినిమాకి పెద్ద‌లకు మాత్ర‌మే ముద్ర త‌ప్ప‌లేదు. మొత్తంగా ఎనిమిది చోట్ల క‌ట్ చెప్పిన‌ట్టు స‌మాచార‌మ్‌!  సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిశాయి. ఇక‌ ఈ సినిమా ఫ‌లితం కోసం 31వ‌ర‌కూ ఎదురుచూడ‌క త‌ప్ప‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: