సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి చాన్స్ వస్తే...ఎంతో అదృష్టంగా భావిస్తారు.  కొంత మంది సినిమా చాన్స్ ల కోసం ఎన్నో సంవత్సరాలు పడిగాపులు కాస్తుంటారు.  అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువ శాతం వారసులు హవా నడుస్తున్న విషయం తెలిసిందే.  సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా ఒక కథానాయిక స్టార్ గా మారిపోతే ఆ తరువాత వాళ్ల సిస్టర్స్ కూడా రంగప్రవేశం చేస్తుంటారు.

 ఇప్పటి వరకు తెలుగులో స్టార్ హిరోయిన్లుగా వెలిగిపోయిన జయసుధ, రాధ,రాధిక,భానుప్రియ ఇలా చాలా మంది హీరోయిన్లు వారి చెల్లు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.  వారిలో కొంత మంది కెరీర్ మలుపు తిరిగినా కొంత మంది మాత్రం సక్సెస్ సాధించలేక పోయారు.  తాజాగా వీరి బాటలోనే నడుస్తుంది..అంజలి. ప్రస్తుతం అంజలి తమిళ, తెలుగు, మళియాళ భాషల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  

ఈ అమ్మడి చెల్లె  'ఆరాధ్య' కూడా త్వరలో వెండితెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తన గ్లామర్ చూసి సినిమాల్లోకి వెళ్లమంటూ స్నేహితులు పదేపదే చెబుతూ ఉండటంతో, తనలో ఆసక్తి కలిగిందని  అందుకే ఇండస్ట్రీ వైపు వస్తున్నట్లు ఆరాధ్య అంటుంది. అక్క అంజలి స్ఫూర్తితోనే ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పింది. ప్రస్తుతం తమిళంలో సముద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాననీ, తెలుగులోను ఒక సినిమాకి ఓకే చెప్పానని అంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: