దిగ్దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి ఒక దక్షిణ భారత సినిమా, అదీ తెలుగు సినిమాకు జాతీయ గుర్తింపునేకాదు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చిన నయనానందకర నవరసాత్మక వెండితెర విందైన భారీ చిత్రం బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన పాత్రలలో యవనిక పై పందుగ చేసిన ఈ సినిమా తెలుగు సినిమా "మార్కెట్ రేంజ్" ను బాలీవుడ్ ఆపై హాలీవుడ్ స్థాయికి చేర్చింది. రెండో భాగంతో రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి బృందం ఇప్పుడు మరో సంచలన ప్రయోగానికి సిద్దమౌతుంది. 

bahubali combined vertion కోసం చిత్ర ఫలితం


ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన అయిన ఈ సంచలనాల బాహుబలి సినిమాను ఇప్పుడు రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా ఎడిట్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే చైనాలో బాహుబలి 2 ది కంక్లూజన్ ను భారీగా విడుదల చేసేందుకు సిద్ధమైన బాహుబలి బృందం ఇతర భారతీయ భాషల్లో కూడా "బాహుబలి" కొత్త వర్షన్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. రెండు భాగాలు కలిపి మూడు గంటలకు ఎడిట్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవు తున్నారు. మరి ఈ రీ-రిలీజ్ లో బాహుబలి ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. భారత్ లోని అన్నీ భాషల ప్రేక్షక సమూహానికి నిజంగా ఇది వీనులవిందైన వార్తే మరి. 


bahubali combined vertion కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: