తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ..తర్వాత విలన్ గా నటించి హీరోగా మారి శ్రీకాంత్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కామెడీ, ఫ్యామిలీ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.  ఈ మద్య బాబాయి పాత్రల్లో నటిస్తూ వస్తున్న శ్రీకాంత్ ‘యుద్దం శరణం’ చిత్రంలో విలన్ గా నటించారు.  తాజాగా హీరో శ్రీకాంత్ పై ఓ సైకో దాడి చేసి హల్ చల్ సృష్టించాడు. 
Image result for srikanth
వివరాల్లోకి వెళితే..కర్నూలు జిల్లాకు చెందిన బీ వెంకటేశ్ (29) పలువురు ప్రముఖుల ఇళ్లలో వంట మనిషిగా పనిచేశాడు. మూడు సంవత్సరాల క్రితం శ్రీకాంత్ ఇంట్లో కూడా వెంకటేష్ పని చేశాడు.  అతని పరిస్థితి..ప్రవర్తన నచ్చకపోవడంతో ఇంట్లో నుంచి పంపించి వేశారట శ్రీకాంత్ ఫ్యామిలీ.  కాకపోతే వెంకటేశ్ కు శ్రీకాంత్ అంటే చాలా అభిమానం.  తాజాగా  ఇక శ్రీకాంత్ తనకు తరచూ కలలోకి వస్తున్నాడని, ఎన్నిమార్లు కలిసేందుకు వెళ్లినా అనుమతించడం లేదని చెబుతూ, నిన్న శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించాడు.
Image result for srikanth
వాచ్ మెన్ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి, అక్కడున్న ఏపీ 10 ఏఎస్ 0789, ఏపీ 09 సీఎల్ 9414 కార్లను ధ్వంసం చేశాడు. అదే సమయంలో కారు డ్రైవర్ పై దాడి చేసి ఇంట్లోకి వెళ్లాడు..ఆ సమయంలో మేడ దిగి వస్తున్న శ్రీకాంత్ ను మెడపట్టి మెట్లపై నుంచి తోశాడు. తృటిలో శ్రీకాంత్ కు ప్రమాదం తప్పింది.  ఆ సైకో దాడి చేసిన సమయంలో శ్రీకాంత్ భార్య, పిల్లలు ఇంట్లో లేరు.  సమాచారం అందుకున్న పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారిపైనా దాడికి ప్రయత్నించాడు.

ఆ సైకోని  కష్టం మీద అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు వెంకటేష్ సైకోలా రక రకాలు గా మాట్లాడుతూ..తనలోని మరో వ్యక్తిని శ్రీకాంత్ స్వయంగా పిలిచాడని అందుకే వెళ్లానని సమాధానం ఇస్తున్నాడు. అంతే కాదు అసలు వెంకటేష్ ఈ పని చేయడని పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. పోలీసులు అతనిపై క్రిమినల్ కేసులు పెట్టినట్టు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: