‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ తరువాత దర్శకుడు బాబికి జూనియర్ తో సినిమా చేసే అవకాశం రావడంతో బాబి దశ తిరిగింది అని అనుకున్నారు అంతా. అయితే అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘జై లవ కుశ’ కలెక్షన్స్ సునామీ సృట్టిస్తున్నా బాబికి ఏమాత్రం కలిసి రాలేదు. అంతేకాదు కొన్ని సందేహాలు పై కలిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.

దర్శకుడు బాబి గతంలో రవితేజాకు చెప్పిన కథనే మార్చి ‘జై లవ కుశ’ గా తీసాడని అదేవిధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో తీసిన ‘ఇజమ్’ తరువాత  జూనియర్ కు చెప్పిన కధలోని కొన్ని పాయింట్స్ బాబి తన ‘జై లవ కుశ’ లో కాపీ కొట్టాడు అన్న సందేహాలు గాసిప్పులుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు బాబి.  

‘జై లవ కుశ’ కథను ఎవరికీ వినిపించలేదని ఆ స్టోరీని దాదాపు ఐదేళ్ల కిందటే రాసుకున్నప్పటికీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ కు మాత్రమే వినిపించానని అంటున్నాడు. రవితేజకు చెప్పిన స్టోరీ ‘జై లవ కుశ’ కాదని ఆ స్టోరీతో త్వరలోనే రవితేజతో సినిమా ఉంటుందని అంటూ మరో క్లారిటీ ఇస్తున్నాడు బాబి. 

వాస్తవానికి ‘జై లవ కుశ’ కంటే ముందు ఎన్టీఆర్ కోసం మరో స్టోరీ రాసుకున్నాడట ఈ దర్శకుడు. ఆ స్టోరీ జూనియర్ కు చెబుదామని 2, 3 సార్లు ప్రయత్నించాడట అయితే అనుకోకుండా ‘జై లవ కుశ’ కథ ఓకే అవ్వడంతో మరో స్టోరీలైన్ జూనియర్ కు  వినిపించే అవసరం కలగలేదు అంటున్నాడు బాబి.    

ఇదే సందర్భంలో ‘జై లవ కుశ’ లో ‘జై’ పాత్రకు ప్రత్యేకమైన మేకప్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిత్రబృందం ఓ హాలీవుడ్ మేకప్ నిపుణుడుని హైదరాబాద్ రప్పించిన సంగతి గురించి వివరణ యిస్తూ ఆ టెక్నీషియన్ ప్రత్యేకమైన మేకప్ డిజైన్లు చేయడమే కాకుండా ఇందుకోసం కొన్ని గ్రాఫిక్స్ కూడ ఉపయోగించాలనుకున్నామని అయితే  ఎన్టీఆర్ సాంకేతిక నైపుణ్యంతో కంటే  తన నటనకు సంబంధించిన హావభావాలతో తేడా చూపిద్దామని ఎన్టీఆర్ అనడంతో హాలీవుడ్ మేకప్ మ్యాన్ ఆలోచన విరమించు కున్నట్లు బాబీ చెపుతున్నాడు. ఏది ఏమైనా  ‘జై లవ కుశ’ 100 కోట్ల సినిమాగా మారినా కెరియర్ పరంగా బాబికి పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: