అందరు అనుకున్నట్టుగానే శివ బాలాజి బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ గా ప్రైజ్ మనీ సంపాదించుకున్నాడు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మా ఎంతో ప్రెస్టిజియస్ గా చేసిన ఈ రియాలిటీ షో నిన్నటితో ముగిసింది. 14 మంది కంటెస్టంట్స్ ఆ తర్వాత మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షోని సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఎన్.టి.ఆర్ హోస్టింగ్ తో పాటుగా హౌజ్ మెట్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది.


ఇక శివ బాలాజి విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌజ్ లో మీసాల రాయుడు, ముక్కోపి లాంటి బిరుదులు తెచ్చుకున్న అతను ఫైనల్ విన్నర్ గా క్యాష్ గెలుచుకున్నాడు. బలమైన కంటెస్టంట్ గా ఉన్న శివ బాలాజి షో మొదట్లో తన కోపంతో బిగ్ బాస్ ను సైతం తిట్టేశాడు. ఇక మరో పక్క హౌజ్ మెట్స్ మధ్య విభేధాలు వస్తున్నా సరే తాను వారిని కలిపేందుకు ట్రై చేశాడు.


ఎన్.టి.ఆర్ హోస్టింగ్ లో మొదట టెలివిజన్ షోగా క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో నిన్నటితో ముగిసింది. 70 రోజులుగా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన షో కంటెస్టంట్స్ తో పాటుగా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి తారక్ హోస్టింగ్ కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు.


ఇక ఫైనల్ కంటెస్టన్ గా శివ బాలాజితో ఉన్నాడు ఆదర్శ్. టాప్ 5లో హరితేజ, నవదీప్, అర్చన ఎలిమినేట్ అవగా విన్నర్ గా శివ బాలాజి, రన్నర్ గా ఆదర్శ్ ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ వన్ ఎంతో కలర్ఫుల్ ఎండింగ్ తో ఆకట్టుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: