తెలుగు బుల్లితెర చరిత్రలో రికార్డులను సృష్టించిన 'బిగ్ బాస్’ సీజన్ 1 నిన్న రాత్రితో ముగిసిపోయింది. అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ ఈ షో విన్నర్ గా శివ బాలాజీ ఎంపిక కావడం షాకింగ్ న్యూస్ గా మారింది. చివరి వరకు టెన్షన్ సృష్టించిన ఈ షోలో హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్, అర్చన మధ్య చివరి వారం వరకు టఫ్ కాంపిటీషన్ జరిగింది.

చివరిన శివ బాలాజీ, ఆదర్శ్ లు పోటీ పడగా శివబాలాజీకి 3 కోట్ల 34 లక్షల పైచిలుకు  ఓట్లు రావడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తెలుగు విజేతను ఎంపిక చేసే ప్రక్రియలో భారీ స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులు ఓట్లు వేశారు. మొత్తం 11 కోట్ల ఓట్లు ప్రేక్షకుల నుండి వచ్చినట్లు ఎన్టీఆర్ వెల్లడించాడు. 

‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే షో దేవిశ్రీ ప్రసాద్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మొదలై ఆ తర్వాత ఎన్టీఆర్ జాయిన్ అవ్వడంతో రసవత్తరంగా కొనసాగింది. అయితే ‘బిగ్ బాస్’ షో విన్నర్ గా వస్తుంది అనుకున్న హరిప్రియ మూడవ స్థానంతోనే సరిపెట్టుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇదే సందర్భంలో ‘బిగ్ బాస్’ షో మీద పుస్తకం రాయబోతున్నట్లు మహేష్ కత్తి ప్రకటించాడు.

ఈ పుస్తకాన్ని జూనియర్ చేత ఆవిష్కరింప చేస్తానని కూడ తెలియ చేసాడు. గండిపేట గండి మైసమ్మ పాట పాడుతూ సింగర్ మధు ప్రియ చేసిన హంగామా ఈ షోకు హైలెట్ గా మారింది. 

ఈ ఫైనల్స్ కార్యక్రమంలో మహేష్ కత్తికి ‘ఉచిత సలహా’ అవార్డ్. సంపూర్ణేష్ బాబుకు ‘అయోమయం అవార్డు’ దీక్ష పంత్‌కు ‘గ్రైండర్’ అవార్డు ఇచ్చారు. ప్రిన్స్ కు ‘మిస్టర్ రోమియో’ అవార్డు ధన్ రాజ్ కు ‘బెస్ట్ ఎంట్టెన్మెంట్’ ‘కత్తి కార్తీకకు ఫిట్టింగ్ మాస్టర్’  అవార్డులతో పాటు ఈ ‘బిగ్ బాస్’ షోలో అందరి కంటే ఎక్కువగా ఏడ్చిన సింగర్ మధు ప్రియకు ‘గుండెల్లో గోదారి’ అవార్డు ఇవ్వడం అందరికీ నవ్వు తెప్పించింది. ఈ ఫైనల్ షో ను కూడ జూనియర్ తన అపరిమితమైన ఎనర్జీ తో నిర్వహించి బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: