పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనస్తత్వం అర్ధం చేసుకోవడం కష్టం అని అతడి  సన్ని హితులు కూడ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే కోట్లాది మంది భిమానులు గల పవన్ అలిగాడు అని వార్తలు వస్తున్నాయి.   ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈ సంఘటన  ఎన్టీవీ చౌదరి కుమార్తె పెళ్లి  ఫంక్షన్ లో జరిగింది అని వార్తలు వస్తున్నాయి. 
 
ఎన్టీవీ చౌదరి ఏకైక కుమార్తె వివాహం రంగరంగ వైభవంగా మొన్న జరిగిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయి సెట్టింగ్ ల మధ్య అడుఅడుగునా  గొప్పతనం కనిపించే విధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకులకు దేశం నలుమూలల నుంచి రాజకీయ వేత్తలు పారిశ్రామిక వేత్తలతోపాటు ఎందరో సినిమారంగ సెలిబ్రిటీలు కూడ హాజరు అయ్యారు. 

అయితే  ఈ పెళ్లి వేడుకలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ వరకు వచ్చి  లోపలకు రాకుండానే వెనుదిరిగి వెళ్లి పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ వచ్చిన టైమ్ లోనే  తెలంగాణా రాష్ట్ర సి.యమ్. కెసిఆర్ కూడవచ్చినట్లు తెలుస్తోంది.  సిఎమ్ కాన్వాయ్ కి  సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్న నేపధ్యంలో పవన్ కారును కొంత సేపు వివాహ వేడుక  ఫంక్షన్ హాల్ ముందు ఆపినట్లు తెలుస్తోంది. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయిన పవన్ అసహనంతో కళ్యాణ  వేదికలోపలికి వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
 
ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ఇంత అసహనం కలిగిన వ్యక్తి  రాజకీయాలలో నిలబడి రాజకీయ పార్టీని ఎలా నడుపుతాడు అంటూ ఆ పెళ్ళికి  వచ్చిన చాలా మంది ప్రముఖులు ఈ సంఘటన పై స్పందిస్తూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలను దేవుళ్ళుగా చూసే సంస్కృతి ఉన్న నేపధ్యంలో పవన్ ఇలాంటి చిన్న విషయాలకు కూడ  అసహనానికిలోను అయి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: