ఎన్నో భారీ అంచనాల నడుమ వస్తున్న సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ రిలీజ్ కు ముందే సంచలనాలను సృష్టిస్తుంది. మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పైడర్ సినిమాలో మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.


మహేష్ సత్తా ఏంటో ఓవర్సీస్ లో కూడా మారుమోగిపోతుంది. ఓవర్సీస్ రాజుగా మహేష్ ఇక్కడ రిజల్ట్ తేడా కొట్టినా సరే ఓవర్సీస్ లో మాత్రం తన స్టామినా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక రిలీజ్ కాబోతున్న స్పైడర్ సినిమా అయితే ప్రీమియర్స్ తోనే రికార్డ్ వసూళ్లల్తో హాఫ్ మిలియన్ కలక్షన్స్ సాధించింది మహేష్ స్పైడర్ మూవీ.


రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ నుండి వస్తున్న ఈ స్పైడర్ కేవలం తెలుగు భాషలోనే కాదు తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో మార్కెట్ పై కన్నేసిన మహేష్ స్పైడర్ తో సంచలనాలకు షురూ చేస్తున్నాడు. 


దసరా బరిలో దుమ్ముదులిపేందుకు వస్తున్న స్పైడర్ అంచనాలను అందుకునేలా ఉంటుందని ఒవర్సీస్ లో ప్రీమియర్ షోస్ హవా చూస్తుంటేనే తెలుస్తుంది. కచ్చితంగా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని మాత్రం చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: