తెలుగు ఇండస్ట్రీలోకి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  మొదట్లో యాంగ్రీ యంగ్ మాన్ గా కనిపించిన వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారారు.  అప్పట్లో వెంకటేష్ సినిమా అంటే కుటుంబంతో వెళ్లి చూడదగ్గ చిత్రంగా మంచి ఎంట్రటైన్ మెంట్ గా ఉండేవి.  గత కొంత కాలంగా వెంకటేష్ సినిమాలు తక్కువగా చేస్తున్నారు.  దృశ్యం చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటించారు.  ఇండస్ట్రీకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి దాదాపు ముప్పయి సంవత్సరాలు అవుతుంది.  
Image result for sultan movie stills
ఈ సంవత్సరం ‘గురు’ చిత్రంతో మంచి విజయం సాధించిన వెంకటేష్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా కనిపించారు.  ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న వెంకి నకి బాగా సూట్ అయ్యే కథ కోసం వెతుకడం వల్లే ఆలస్యం జరిగింది అంటున్నారు. అయితే వెంకీ నెక్స్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్‌లో వుండబోతుందట.  ఆ మద్య బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పనక్కరలేదు.
Image result for venkatesh guru movie stills
రెజ్లింగ్ వీరుడి బయోపిక్‌గా తెరకెక్కిన ‘సుల్తాన్’  ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. సల్మాన్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమా, క్రితం ఏడాది భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.  తాజాగా  ‘సుల్తాన్’ మూవీని తెలుగు నేటివిటీకి తగినట్లుగా చేస్తూ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

 ఈ సినిమాలో కథానాయికగా రితికా సింగ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గురు’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.  పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: