ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సినిమా గురువారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయినందున నిన్న సాయత్రం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు చిత్రయూనిట్. ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తూ దుమ్మురేపిన ఈ సినిమా దర్శకుడు బాబి ఈ సక్సెస్ మీట్ స్పీచ్ లో కాస్త ఎమోషనల్ అయ్యాడు.


సినిమా కథ రాసుకున్నప్పుడు ఇది కేవలం ఎన్.టి.ఆర్ మాత్రమే చేయగలడని.. ఈ సినిమా ఒకవేళ ఎన్.టి.ఆర్ ఒప్పుకోకుంటే కథ అటకమీద బూజు పట్టేదని అన్నారు. ఇక అంతేకాదు తన భార్యకు ఎనిమిదో అద్భుతం ఏంటని అడుగుగా దాన్ని రోజు తాను సెట్స్ లో చూస్తున్నానంటూ చెప్పానని తారక్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు దర్శకుడు బాబి.


పవర్ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్న బాబి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాస్త వెనకపడ్డాడు. ఇక జై లవ కుశతో మరోసారి తన సత్తా చాటుకున్న బాబి ఇక నుండి తాను స్టార్స్ కు కథలను చెబుతానని అంటున్నాడు. ఇక ఎన్.టి.ఆర్ పేరుని కేవలం సంవత్సరం మాత్రమే కాదు జీవితానంతం వాడుకుంటానని అంటున్నాడు బాబి.


జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తర్జన భర్జనలో ఉన్నప్పుడు బాబి చెప్పిన కథ యెస్ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలని అనుకున్నాడట తారక్. అందుకే అన్నయ్య నిర్మాణంలో సినిమా తీసి అదే రేంజ్ హిట్ కొట్టాడు. చూస్తుంటే ఈ సినిమా తారక్ కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: