రేపువిడుదల కాబోతున్న ‘స్పైడర్’ కు సంబంధించి వస్తున్న 500 కోట్ల కలెక్షన్స్ టార్గెట్  వ్యూహాలకు వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖదర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈమూవీ విడుదలకు ముందే భారీ హైప్‌ తో రికార్డులను  క్రియేట్ చేసేవిధంగా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘బాహుబలి’ చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కానున్న చిత్రంగా ‘స్పైడర్’ ఒక  రికార్డును సొంతం చేసుకున్న విషయంతెలిసిందే. 

ఈమూవీ మనదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌ లో అత్యధిక కేంద్రాల్లో విడుదల అవుతోంది. అమెరికాలో ‘స్పైడర్’ చిత్రం సుమారు 300 స్కీన్లలో విడుదలవుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాలు ‘దిల్‌వాలే’ ‘దంగల్’ ‘బాహుబలి 2’ చిత్రాలు మాత్రమే 300 పైగా స్కీన్లలో విడుదలయ్యాయి. ఆతర్వాత అదేస్థాయిలో విడుదలవుతున్న చిత్రంగా ‘స్పైడర్’  ఆసినిమాలతో సమానంగా ఒక చరిత్రను సృష్టిస్తోంది. 

‘స్పైడర్’  చిత్రాన్ని అమెరికా పంపిణి  హక్కులను ఆట్మస్, ఏజెడ్ ఇండియా మీడియా అత్యంత భారీ మొత్తాన్ని చెల్లించి ఈమూవీ  హక్కులను సొంతం చేసుకున్న నేపధ్యంలో ఈచిత్ర ప్రమోషన్‌ లో ఏటీ అండ్ టీ, సినీమార్క్ థియేటర్స్, ఏంఎమ్సీ, ఫాండాగో ఇతర సంస్థలు పాలుపంచుకొంటున్నాయి.  ఇది ఇలా ఉండగా . స్పైడర్ అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో విశేష స్పందన లభిస్తున్నది. తెలుస్తున్న సమాచారం  ఇప్పటికే  5లక్షల డాలర్ల మేర టికెట్లుస్పైడర్ వి  అమ్ముడుపోయాయి అన్నవార్తలు వస్తున్నాయి.  

ఇప్పటికే ఓవర్సీస్ లో పలు స్కీన్ల వద్ద టికెట్స్ సోల్డ్ అవుట్ అనేబోర్డులు దర్శనమివ్వడం ఈచిత్రంపై ఉన్న క్రేజ్‌ కు నిదర్శనంగా మారింది అన్నవార్తలు వస్తున్నాయి.  అమెరికాలో ప్రీమియర్ షో పడే 26వ తేదీరాత్రి  సమయానికే  ‘స్పైడర్’ ఒక మిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, అరబిక్ భాషల్లో విడుదలఅవుతున్న నేపధ్యంలో ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

‘స్పైడర్‌’ పై భారీఅంచనాలు ఉండటంతో ఒకవేళ తొలిరోజే ఈమూవీ పై సానుకూలంగా పాజిటివ్  టాక్ వస్తే ఈసినిమాకు కలెక్షన్లు సునామీలామారిపోతాయి.  ఆతర్వాత అక్టోబర్ 2వరకు అన్నీ సెలవులు ఉండటంతో దాదాపు 500కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 800 స్క్రీన్లలో విడుదలయ్యే ‘స్పైడర్’ ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డులను ‘స్పైడర్’ బ్రేక్ చేసి మహేష్ కెరియర్‌లోనే నెం.1సినిమాగా నిలవడం ఖాయమని అంటున్నారు. అయితే ఈఅంచనాలు ఎంతవరకు వాస్తవం అన్నది రేపు ఉదయానికి తేలిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: