సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు మంచి పొజీషన్లోకి రాగానే వారి వారసులుగా చెల్లెల్లు హీరోయిన్లు గా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.  జయసుధ, రాధ, భానుప్రియ, రాధిక,నగ్మ,కాజల్ ఇలా చాలా మంది హీరోయిన్ల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేక పోయారు. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయిగా బాగా పాపులర్ అయిన అంజలి చెల్లెలు అంటూ ఓ అప్ కమింగ్ హీరోయిన్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  

ఆరాధ్య అనే కొత్త హీరోయిన్ మీడియా ముందుకు వచ్చింది. మా అక్క లాగే నేను కూడా హీరోయిన్ అవుతున్నానని , మా అక్క అంజలి సపోర్ట్ నాకుందని గొప్పగా చెప్పుకుంది ఆరాధ్య. కాకపోతే అంజలి మాత్రం తనకు చెల్లెల్లు ఎవరూ లేరని ఉన్నది ఒక్క అక్క మాత్రమే ఉందని చెబుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ కాస్త హాట్ హాట్ గానే నడుస్తుంది.

అసలు విషయానికి వస్తే..ఆరాధ్య అంజలి చెల్లెలే కానీ సొంత చెల్లి కాదు బంధువు. ఈ బంధుత్వంతోనే అంజలి తన అక్క అంటూ ఈ అమ్మడు క్రేజ్ సంపాదించడాని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు గ్గరి బంధువే కానీ వాళ్ళతో అంజలి కి సత్సంబంధాలు లేవు దాంతో ఆరాధ్య నా చెల్లెలు కాదు అని అంటోంది ఆగ్రహంతో. మొత్తానికి అక్కా చెల్లెళ్ళ గొడవ కు క్లారిటీ వచ్చినట్లయ్యింది. 

Image result for anjali



మరింత సమాచారం తెలుసుకోండి: