తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన పరంగానే కాకుండా మాటల చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఈ మద్య బాగానే పాపులర్ అవుతున్నారు.  ఇక బుల్లితెరపై ‘బిగ్ బాస్ ’ రియాల్టీ షో తో ఎన్టీఆర్ లోని నటనే కాదు మాటతో తన చిలిపి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  పద్నాలు మంది సభ్యులతో బిగ్ బాస్ షో మొదలు కాగా ఇందులో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.  డెబ్బైరోజుల పాటు ఎంతో ఉత్కంఠంగా సాగిన బిగ్ బాస్ షో లో శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేసే సందడి చూడటానికి ప్రేక్షకులు టివిలకు అతుక్కుపోయేవారు.  
Image result for  big boss show
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 1 ముగిసింది..నటుడు శివబాలాజీ విన్నర్ గా నిలిచాడు.  ఈ ప్రోగ్రామ్ కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ‘జై లవ కుశ’ చిత్రం రిలీజ్ అయ్యింది.  మూడు పాత్రల్లో ‘జై’ పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని..తన నటన, డైలాగ్స్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారని అందుకే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందని చిత్ర యూనిట్ అంటున్నారు.
Related image
 తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ జరిగింది..ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఒక కథ చెప్పారు.  ఒక కుటుంబంలోని పెద్దకు ప్రమాదం జరగడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారు..అయితే ఎమర్జెన్సీ కావడంతో అతనికి నిపుణులైన డాక్టర్లు ఆపరేషన్ చేయబోతున్నారు.  కుటుంబ సభ్యులు భయంతో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు..డాక్టర్ ఏం చెప్పబోతున్నారు..అసలు బరోసా ఉందా లేదా అన్న ఎదురు చూపులు చూస్తుంటారు.  
Image result for jai lava kusa stills
ఇక అక్కడ అటూ ఇటూ తిరిగే వారు ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేయడం మొదలు పెట్టారు.  లోపల పేషెంట్ సీరియస్ గా ఉన్నారా..అయితే బతకడం కష్టం, మరో వ్యక్తి ఈ మద్య మా బంధువుకు ఇలాగే జరిగింది ఆయన పోయారు...మరో వ్యక్తి ఎమర్జెన్సీ అంటున్నారు..మరి బతకడం కష్టమే అండీ అని కుటుంబ సభ్యులతో అనడంతో వారు మరింత కుంగిపోతారని అన్నారు.  అసలు వీరు ఎవరూ..? పేషెంట్ కి ఏం జరిగినా ఆ బాధ్యత వైద్యులదే కదా..! ఆ వైద్యులు పేషెంట్ బతుకుతాడో..లేదో తేల్చి చెప్పేది.  

కానీ ముందుగానే దారిన పోయే దానయ్య  పేషెంట్ చనిపోతాడని డిసైడ్ చేయడం చేస్తుంటారు.  ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ప్రక్రియే మొదలైనట్లు నాకు అనిపిస్తుంది. ఒక చిత్రం విడుదల అయితే అది ఎమర్జెన్సీ వార్డు లో ఉన్న పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా చస్తాడా అని అనుకునే చుట్టాలం సినిమా తీసిన మేం..ఇక డాక్టర్లు ప్రేక్షకులు.
Jai Lava Kusa Movie Jayotsavam Photos
దారిన పోయే దానయ్యలు కొంత మంది విశ్లేషకులు.  సినిమా హిట్టా..ఫట్టా అనే విషయాన్ని డాక్టర్ల స్థానంలో ఉన్న ప్రేక్షకులు తేలుస్తారు. సినిమా ఫ్లాప్ అంటారా..ఒకే మరోసారి మంచి కథతో వస్తాం..సినిమా హిట్ చేస్తారా..వారికి కృతజ్ఞత తెల్పుతాం. ఇండస్ట్రీలో హిట్టూ, ఫ్లాపు అనేవి సహజం..కానీ ఎంత వరకు పేరు వచ్చింది అనేది ముఖ్యం అని అన్నారు.  మొత్తానికి ఎన్టీఆర్ పరోక్షంగా రివ్యూ రైటర్స్ పై సెటైర్లు వేసినట్లుందని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గం. 


మరింత సమాచారం తెలుసుకోండి: