కుర్ర హీరోల సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ స్టార్ ఛాన్సెస్ అందుకోడానికి పెద్ద టైం ఏం తీసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ హిట్లు అందుకుంటున్న రకుల్ ఇప్పుడు తనకు కొత్త లవ దొరికేశాడంటూ చాటింపేస్తుంది. ఇంతకీ రకుల్ కొత్త లవ ఎవరు రకుల్ మనసు దోచిన అతగాడెవరు అని చూస్తే మాత్రం అందరు షాక్ అవుతున్నారు.


అమ్మడు చెబుతున్న లవ్ లైఫ్ పార్ట్ నర్ గురించి కాదు తనకు ఇష్టమైన లక్సరీ కార్ గురించి. ఈమధ్యనే రకుల్ ఓ కొత్త బంజ్ ఎస్.యు.వి మోడల్ కార్ కొన్నదట. తన రెమ్యునరేషన్ తో కొన్న ఈ కార్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో పెట్టి తన కొత్త లవ్ ఇదే అంటూ రకుల్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇంతకుముందున్న జాగ్వార్ కు తోడుగా రకుల్ ఈ బెంజ్ కార్ తీసుకుంది.


ఇక రేపు రిలీజ్ అవబోతున్న స్పైడర్ లో మహేష్ పక్కన జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాతో మరో విజయం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ ఇయర్ ఇప్పటికే మూడు సినిమాలతో అలరించిన రకుల్ ఈ సినిమాతో మరింత అలరిస్తుందని అంటున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో నటించాలన్న కోరిక తీర్చుకున్న రకుల్ ఆమె డెడికేషన్ చూసి మరో ఛాన్స్ కూడా ఇచ్చాడని అంటున్నారు.


టాలీవుడ్ క్రేజీ బ్యూటీల్లో రకుల్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం యువ హీరో, స్టార్ హీరో అన్న తేడాలేవి లేకుండా రకుల్ అందరితో జతకడుతూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. టాప్ చెయిర్ కు పోటీ పడుతున్న రకుల్ అతి కొద్దిరోజుల్లోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కిరీటం దక్కించుకోబోతుందనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: