బాలీవుడ్ లో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్.   ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.  అమితాబచ్చన్ నటించిన ‘హమ్’ చిత్రం ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్టీ స్టార్ సినిమాగా రూపొందిన హమ్ చిత్రం పాటలు, డైలాగ్స్ తో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   
Image result for hum movie amitabachan
ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన టైగర్ పాత్ర  మంచి పేరు తీసుకు వచ్చింది.  తాజాగా హమ్ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన టైగర్ పాత్ర గెట‌ప్‌లో సంద‌డి చేసిన ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా? ఈమె ఎవ‌రో కాదు..ఆ మద్య వెంకటేష్ తో ‘సాహసవీరుడు..సాగర కన్య’ లో మురిపించి మై మరిపించిన పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి.

ద‌ర్శకురాలు ఫ‌రాఖాన్‌ వ్యాఖ్యానంలో `లిప్ సింగ్ బ్యాటిల్‌` పేరుతో స్టార్‌ప్ల‌స్ ఛాన‌ల్ రూపొందిస్తున్న కార్య‌క్ర‌మం కోసం ఆమె ఇలా గెట‌ప్ వేసుకున్నారు.  అయితే ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పాట‌ల‌కు ఆయా పాట‌ల్లో న‌టించిన న‌టీన‌టుల హావ‌భావాల‌ను ప‌లికిస్తూ డ్యాన్స్‌లు చేయాలి. శిల్పాశెట్టి అమితాబ్ న‌టించిన `జుమ్మా చుమ్మా` పాట‌కు డ్యాన్స్ చేసింది.

అందుకోసం ఆమె ఈ గెట‌ప్ వేసుకుంది. కొత్త గెటప్పులు, కొత్త వీడియోలు ఏవైనా తీస్తే సెలబ్రెటీలు వెంటనే తమ ట్విట్టర్ లో, ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేయడం అలవాటే కదా. తాజాగా ఈ అమ్మడు కూడా త‌న గెట‌ప్‌కి సంబంధించిన ఫొటోల‌ను శిల్పా శెట్టి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అమితాబ్ బ‌చ్చ‌న్ వేసిన స్టెప్ వేస్తూ ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: