బాలీవుడ్ లో ఎలాగైనా సరే పాగా వేయాలని చూస్తున్న రత్తాలు అదేనండి రాయ్ లక్ష్మి ప్రస్తుతం చేస్తున్న జూలీ-2కు సర్వస్వం దారపోస్తుంది. సినిమాకు కావాల్సిన దాని కన్నా అమ్మడు మరింత రెచ్చిపోతుందని చెప్పాలి. ఇక ప్రస్తుతం సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబందించిన ఓ టాప్ లెస్ పిక్ తో సంచలనం సృష్టిస్తుంది రాయ్ లక్ష్మి.


ఖైది నంబర్ 150లో రత్తాలు సాంగ్ తో రెచ్చిపోయిన ఈ అమ్మడు జూలీ-2 కోసం ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. సినిమా అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా ఆడియెన్స్ అటెన్షన్ ను ఇప్పటినుండే కాపాడుకుంటుంది. హిందిలో ఇలాంటి సినిమాలకు కొదవే లేదు కాని సౌత్ లో కాస్త కూస్తో క్రేజ్ ఉన్న రాయ్ లక్ష్మి మొదటిసారి ఇలాంటి సినిమా ఈ రేంజ్ లో అందాలను దారపోయడం కొత్తగానే ఉంది.


సినిమాకు ఆమె అందాలే ప్లస్ అవుతాయని అంటున్నారు. జూలీ మొదటి పార్ట్ కన్నా ఈ సినిమా కచ్చితంగా ఆడియెన్స్ కు మరింత థ్రిల్ అందిస్తుందని అంటున్నారు. సినిమాలో హాట్ సీన్స్ కు అయితే కొదవేలేదని తెలుస్తుంది. రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటుగా రాయ్ లక్ష్మి సోలో సాంగ్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.   


కచ్చితంగా రాయ్ లక్ష్మి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఓ ఐడెంటిటీ సంపాదిస్తుందని చెప్పొచ్చు. మరి అమ్మడు ఎన్నో ఆశలను పెట్టుకున్న ఈ సినిమా అక్కడ తనకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: