‘బిగ్ బాస్’ షో ముగిసి పోవడంతో ఆ రియాలిటీ షో రెండవ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అన్న ఆత్రుతతో బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ‘బిగ్‌ బాస్’ మరోస్థాయికి వెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

టెలివిజన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకున్న ఈ షో సెకండ్ సీజన్ కు స్టార్ మా ఛానల్ యాజమాన్యం అప్పుడే ఆలోచనలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ‘బిగ్‌ బాస్ 2’కు హోస్ట్‌గా వ్యవహరిస్తానో లేదో అంటూ ఇటీవల ‘జై లవ కుశ’ ప్రమోషన్ సందర్భంగా జూనియర్ వ్యాఖ్యలు చేసాడు. 
ఈ వ్యాఖ్యలు వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ఉంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ ‘బిగ్‌ బాస్ 2’ ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్టు సమాచారం. 

యంగ్ టైగర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం త్రివిక్రమ్ తో చేయబోతున్న మూవీ అని అంటున్నారు. ఈ చిత్రంలో జూనియర్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. దీనితో ‘బిగ్‌ బాస్ 2’ షోను హోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లుక్ లీక్ అవుతుందనే భయం త్రివిక్రమ్ కు ఉంది అని టాక్. 

ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడానికి యంగ్ టైగర్ విదేశాలకు కూడా జూనియర్ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్‌ కు ఒక కొత్త ప్రయోగం లాంటిది అని అంటున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా కోసం పూర్థిస్థాయి సమయాన్ని కేటాయించాలని జూనియర్ భావిస్తున్న నేపధ్యంలో జూనియర్ స్థార్ మా యాజమాన్యం ఎంత ఒత్తిడి చేసినా ‘బిగ్ బాస్ 2’ షోను తిరస్కరించడానికే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: