సినీ విమర్శకులు నుండి సామాన్య  ప్రేక్షకుల వరకు నెగెటివ్ టాక్ తో టార్గెట్  కాబడ్డ స్పైడర్  టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది అని ఈ సినిమా నిర్మాతలు ఇస్తున్న లీకులు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  తొలి వారాంతానికే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది అని అనడం  ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచే స్తోంది. 

మహేశ్‌బాబు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం  విడుదలైన తొలి రోజునే 51 కోట్లు వసూలు చేసింది. రెండు రోజులు ముగిసే సరికి కలెక్షన్ల మొత్తం 72 కోట్లకు చేరింది అని నిర్మాతలు ధ్రువీకరిస్తున్నారు.  ఇప్పుడు ఏకంగా వారాంతానికి చేరుకొనే సరికి ‘స్పైడర్’ 100 కోట్లకు చేరుకొన్నట్లు నిర్మాతలు చెపుతున్న మాటలు ఇండస్ట్రీ వర్గాల మైండ్ ను బ్లాంక్  చేస్తున్నాయి అని తెలుస్తోంది. 

లాంగ్ వీకెండ్ కావడంతో తొలుత తడబాటుకు గురైన ‘స్పైడర్’ కలెక్షన్లు సెలవు దినాల్లో పుంజుకోవడంతో ఇది సాధ్యమైనట్లు ఈసినిమా నిర్మాతలు మరికొంతమంది ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాలోను ‘స్పైడర్’ చిత్రం వసూళ్లు మోత మోగిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొనడం సంచలనంగా మారి నిజంగా ‘స్పైడర్’ ఈ రేంజ్ లో కలక్షన్స్ రాబట్టుకోగాలిగిందా అనే విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. 

దీనికితోడు ‘స్పైడర్’ ఈ వీకెండ్ కు అమెరికాలో 10 కోట్ల కలక్షన్స్ కు దగ్గరలో ఉంటుంది అని అంటున్నారు. ‘స్పైడర్’ టాక్ ఎలా ఉన్నా ముఖ్యంగా ఈసినిమాకు తమిళనాడులో మంచి కలక్షన్స్ రావడం బట్టి ‘స్పైడర్’ విషయంలో తెలుగు సినిమా ప్రేక్షకులలో ఏర్పడ్డ మితిమీరిన అంచనాలు ఈసినిమాకు శాపంగా మారిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఈమూవీకి 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వస్తేకాని ఈసినిమా బయ్యర్లు గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో ఏదైనా అద్భుతం జరిగితే మాత్రమే ‘స్పైడర్’ బయ్యర్లు గట్టెక్కే అవకాశం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: