సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్పైడర్.. అంచనాలను అందుకోవడంలో విఫలమైన స్పైడర్ పండుగ సెలవులు ఉండటం వల్ల వసూళ్లను బాగానే రాబడుతుంది కాని సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అటెంప్ట్ లానే ముగియనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ పై మురుగదాస్ మొదటిసారి స్పందించారు. 


సినిమా తమిళంలో మంచి టాక్ తెచ్చుకుందని అక్కడ మంచి వసూళ్లనే రాబడుతుందని అన్నారు. సినిమా తమిళ ఆడియెన్స్ కు తన సినిమాలలానే అనిపించిందని అయితే ఓవర్సీస్ ఇంకా తెలుగు ప్రేక్షకులకు సినిమాలో మహేష్ ను సాధారణ వ్యక్తిగా ఊహించుకోలేకపోయారని అన్నాడు మురుగదాస్. ఓవరాల్ గా సినిమా మీద తన సమర్ధతను వెళ్లబుచ్చిన మురుగదాస్ తమిళ ప్రేక్షకులకు మాత్రం నచ్చేసింది అన్నారు.


ఇక తెలుగులో మాత్రం ఈ సినిమా నెగటివ్ టాక్ కలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే స్పైడర్ తర్వాత రిలీజ్ అయిన శర్వానంద్ మహానుభావుడు హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో స్పైడర్ థియేటర్స్ ను మహానుభావుడికి ఇస్తున్నారట. స్పైడర్ సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు చెబుతున్నారు.


ఏది ఏమైనా స్పైడర్ సినిమాపై మురుగదాస్ ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చుకున్నా తమిళ తంబీలకు మాత్రం నచ్చేసింది. ఇక మహేష్ ను తమిళంలో స్టార్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన స్పైడర్ ఆ రకంగా మాత్రం సక్సెస్ అయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: