మహేష్ మురుగదాస్ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అనుకున్నారు. దసరా బరిలో స్పైడర్ సత్తా ఏంటో చూపిస్తుందని భావించారు. అయితే మొదటి షో నుండి మిక్సెడ్ టాక్ రావడంతో స్పైడర్ ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అటెంప్ట్ గానే మిగిలేలా కనబడుతుంది. 125 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ స్పైడర్ అంచనాలను అందుకోలేకపోయింది.


సినిమా టీజర్, ట్రైలర్ లోనే కిక్ ఇవ్వలేదు.. అయితే అసలు సీక్రెట్ సినిమాలో ఉంటుంది అందుకే దాన్ని రివీల్ చేయలేదు అన్నారు. తీరా సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. మహేష్ కెరియర్ లో బ్రహ్మోత్సవం తర్వాత ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ లో స్థానం సంపాదించే పరిస్థితులు కబడుతున్నాయి.


సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరుగగా దాదాపు 80 శాతం వరకు డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల పాలవ్వక తప్పదని తెలుస్తుంది. దీనిపై నిర్మాతల మండలిలో చర్చలు కూడా మొదలు పెట్టారట. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది కాని ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.


రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ స్పైగా నటించాడు. ఎస్.జె.సూర్య విలన్ గా నటించగా హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించడం జరిగింది. సినిమా నష్టాలను ఏవిధంగా కవర్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా రిజల్ట్ వల్ల తీవ్ర అసంతృప్తికి గురైన మహేష్ చేయాల్సిన భరత్ అను నేను షెడ్యూల్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: