ఇండస్ట్రీలో ఈ మద్య భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న విషయం తెలిసిందే.  ఇక బాలీవుడ్ విషయానికి వస్తే కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన `ట్యూబ్‌లైట్‌` భారీ అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు ఓ సన్నివేశంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా నటించాడు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ `ట్యూబ్‌లైట్‌` ఘోర పరాజయం పొందింది. 
Image result for judwa 2 movie stills
ఇక షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ నటించిన `జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌`  కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.  ఇక పెద్ద హీరోలు పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాలు చాలా వరకు నిరాశ పరిచాయి. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన  `జుడ్వా 2` సినిమా మాత్రం బాలీవుడ్‌ క‌లెక్ష‌న్ల క‌ల‌ను తిరిగి తీసుకువ‌చ్చింది. మొద‌టి వారాంతానికి ఈ చిత్రం రూ. 60 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.  ఇక 2017 సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రం  `జుడ్వా 2` కావడం విశేషం.   
Image result for judwa 2 movie stills
ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. వ‌రుణ్ ధావ‌న్‌, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌, తాప్సీలు న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని అన్నారు.1997లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘జుడ్వా’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వచ్చింది. ‘జుడ్వా’ చిత్రం అక్కినేని నాగార్జున నటించిన ‘హలోబ్రదర్‌’ చిత్రానికి రీమేక్‌.   ఈ చిత్రానికి వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌  దర్శకత్వం వహించారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: