బాలీవుడ్ లో ఈ మద్య బయోస్కోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ ఎన్నో బయోస్కోపిక్ చిత్రాలు తెరకెక్కించారు.  భారత దేశ చరిత్రలో 13–14వ శతాబ్దానికి చెందిన భారతీయ రాణి ‘పద్మావతి’గొప్ప అందగత్తె. ఆమె మనోహరమైన రూపం పలు దేశాల రాజులను ఆకట్టుకుంటుంది. పద్మినిని దక్కించుకోవాలనే కాంక్షతో ఆమె రాజ్యంపై దండెత్తుతారు.
Deepika is the fierce queen in 'Padmavati' first look
అసలు విషయానికి వస్తే..పద్మావతికి అప్పటికే వివాహం జరుగుతుంది..కానీ ఆమె అందం గురించి ఎంతో మంది రాజులు కథలు కథలుగా చెప్పుకునే వారు..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని చూసేవారు.  ఈ నేపథ్యంలో యుద్దం జరుగుతుంది..ఆ యుద్దంలో పద్మావతి భర్త రావల్‌ రతన్‌ సింగ్‌ చనిపోతాడు.  అప్పుడు ఆ రాజ్య సైన్యం ఏం చేస్తుంది.. శత్రుదేశాల రాజుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి పద్మిని ఏం చేసింది? అనేది చాలా అద్భుతంగా తెరకెక్కించారట.
Image result for padmavati shahid kapoor
ఇప్పటికే పద్మావతిగా దీపికా పదుకొన పోషిస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో రాణి భర్త రావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రను షాహిద్‌ కపూర్‌ పోషిస్తుండగా, శత్రుదేశం రాజు అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రను రణవీర్‌ సింగ్‌ చేస్తున్నారు. దీపికా, షాహిద్ కపూర్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజగా రణవీర్ సింగ్  కి సంబంధించి  అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Padmavati: Ranveer Singh, Deepika Padukone and Shahid Kapoor
 ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో చిత్తోర్‌ఘడ్‌ రాణి పద్మావతి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. మూవీ కాంట్రవర్సీ మాట పక్కనబెడితే డిసెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: