పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్న రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేణు దేశాయ్ అలా చెప్పిందో లేదో.. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో పెళ్లి చేసుకోవద్దంటూ ఆమెకు హేట్ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై రేణు దేశాయ్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు.

Image result for RENU DESAI

          చాలా కాలం తర్వాత మళ్లీ తెరంగేంట్రం చేసింది పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. స్టార్ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లిపై తన మనసులో మాట బయటపెట్టారు. ఒంటరిగా ఉన్నప్పుడు తనను కూడా చూసుకునేందుకు ఒకరుంటే బాగుంటుందని ఫీలవుతున్నట్టు రేణు దేశాయ్ చెప్పారు. రెండు మూడు సందర్భాల్లో తన అక్క తోడుగా నిలిచిందని.. తనకు భర్త ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదు కదా అన్నారు.

Image result for RENU DESAI

          ఇప్పటివరకూ రెండో పెళ్లిపై ఆలోచించలేదని.. అయితే ఎవరైనా తన సరైన జోడీ అనిపిస్తే చేసుకునేందుకు సిద్ధమేనని రేణుదేశాయ్ చెప్పారు. ఇప్పుడీ కామెంట్స్ పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. రెండో పెళ్లి చేసుకోవద్దంటూ సోషల్ మీడియాలో హేట్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్టు చేశారు.

Image result for RENU DESAI

          “ ఈ పోస్ట్ కేవలం నన్ను ఉద్దేశించింది మాత్రమే కాదు.. కానీ ఇలాంట్ కామెంట్స్ చదివినప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం.. ఎలాంటి మైండ్ సెట్ ఉన్న మగాళ్ల మధ్య ఉన్నాం.. అనిపిస్తుంది. ఓ వైపు మహిళల సమానత్వం, అమ్మాయిల అత్యాచారాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరోవైపు ఏడేళ్లుగా ఒంటరిగా ఉన్న తనకు తోడుంటే బాగుంటుందని చెప్తే హేట్ కామెంట్స్ పంపుతున్నారు. మన దేశంలో మగాడు ఏమైనా చేయొచ్చు.. ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ అమ్మాయి ఇంకో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు.. తను జీవితాంతం తప్పు చేశానన్న ఫీలింగ్ తో బతికేయాలా..?” అని రేణు దేశాయ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: