తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాయ్స్ చిత్రంతో పరిచయం అయిన హీరో సిద్దార్థ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా',' బొమ్మరిల్లు ' చిత్రాలతో మంచి విజయం సాధించాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు మనోడికి ఏవీ కలిసిరాలేదు.  దీంతో బాలీవుడ్ లో అయినా అదృష్టం కలిసొస్తుందని భావించిన సిద్దూకి అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు. 

ఇప్పుడు తెలుగు లో యంగ్ హీరోలు నాని, శర్వానంద్, రాజ్ తరుణ్, నిఖిల్ తాజాగా విజయ్ దేవరకొండ మంచి విజయాలతో దూసుకు వెళ్తున్నారు.  మరి ఈ హీరోలతో తలపడి పోటీలో నిలవాలంటే రొటీన్ సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు సిద్దార్థ.  ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కామెడీ, హర్రర్, థ్రిలర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్న విషయం తెలిసిందే. 

రీసెంట్ గా వచ్చిన ‘ఆనందో బ్రహ్మ ’  కామెడీ, హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చింది..మంచి హిట్ అయ్యింది.  ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకోవాలని ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ హారర్ మూవీతో వస్తున్నాడు సిద్దార్థ. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో సిద్దార్థ్ ప్రేక్షకుల్ని కచ్చితంగా భయపెడతాడట.

ది హౌస్ నెక్స్ట్ డోర్ టైటిల్ తో తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కిన సినిమాని ' గృహం ' టైటిల్ తో తెలుగులో విడుదల చేయబోతున్నాడు. మిలింద్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సిద్దర్ద్ కి జోడీగా ఆండ్రియా జెరీమియా నటిస్తోంది.   మరి హారర్ మూవీతో అయినా ఈ లవర్ బాయ్ కి సక్సెస్ వస్తుందో లేదో తెలియాలంటే నవంబర్ వరకూ ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: