పాపం స్పైడ‌ర్ బ‌య్య‌ర్లు అనాల్సిందే ఇప్పుడు... రిలీజ్‌కు ముందు అంద‌రిని త‌న మాయ‌లో ప‌డేసుకున్న స్పైడ‌ర్ తీరా రిలీజ్ అయ్యాక ఇటు ప్రేక్ష‌కుల‌కు అటు మ‌హేష్ ఫ్యాన్స్‌కు, ఇక ఫైన‌ల్‌గా బ‌య్య‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ద‌స‌రాకు వ‌చ్చిన జై ల‌వ‌కుశ‌, మ‌హానుభావుడు సినిమాల తుఫాన్‌లో స్పైడ‌ర్ కొట్టుకుపోయింది. 

spyder movie కోసం చిత్ర ఫలితం

నెగిటివ్ టాక్ దెబ్బ‌తో స్పైడ‌ర్ రెండో రోజు నుంచే చేతులు ఎత్తేసింది. అమెరికాలో అయితే స్పైడ‌ర్ ఢ‌మాల్ అంది. అక్క‌డ ప్రీమియ‌ర్ల‌తో కలిపి తొలి రోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా అక్క‌డ త‌ర్వాత రోజే డ‌బేల్ మనిప‌డిపోయింది. వీకెండ్లో కొత్త సినిమాలు అత్యధిక వసూళ్లు అందుకునే శనివారం రోజు ఈ చిత్రం అక్కడ లక్ష డాలర్ల లోపే వసూలు చేసింది. 


యూఎస్‌లో ఈ సినిమాపై బ‌య్య‌ర్ 15.5 కోట్ల పెట్టుబ‌డి పెట్టాడు. ఈ పెట్టుబ‌డి రావాలంటే ఈ సినిమా అక్క‌డ రూ 15.5 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. అంటే 3 మూడు మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా రాబ‌ట్టాలి. అయితే 1.3 మిలియ‌న్ డాల‌ర్లు కూడా రాబ‌ట్ట‌లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్ల బిజినెస్ జ‌రిగితే ఇప్ప‌టికి రూ.32 కోట్లకు కాస్త అటూ ఇటూగా మాత్ర‌మే షేర్ రాబ‌ట్టింది. దీంతో స్పైడర్ ఎఫెక్ట్‌తో బ‌య్య‌ర్ల‌కు పెద్ద దెబ్బే ప‌డ‌నుంది.  పోయిన సంవత్సరం వచ్చిన బ్రహ్మోత్సవం కన్నా కాస్త మెరుగేమో గానీ 130 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకి వచ్చే వసూళ్ళు మాత్రం కాదు.
 spyder movie కోసం చిత్ర ఫలితం
స్పైడ‌ర్ ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ ( రూ.కోట్ల‌లో )
నైజాం - 9.60 
సీడెడ్ - 4.50
ఉత్త‌రాంధ్ర - 3.75
ఈస్ట్ - 3.66
వెస్ట్ - 2.72
గుంటూరు - 3.48
కృష్ణా - 2.42
నెల్లూరు - 1.74
---------------------------------------
ఏపీ+తెలంగాణ = 31.90 కోట్లు
---------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: